Begin typing your search above and press return to search.

వార్ 2.. ఫ్యాన్స్ కోరుకునేది ఇదే..

టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీపడి నాటునాటు పాటకి డాన్స్ చేసి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేశారు

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:17 AM GMT
వార్ 2.. ఫ్యాన్స్ కోరుకునేది ఇదే..
X

టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీపడి నాటునాటు పాటకి డాన్స్ చేసి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేశారు. ఇండియన్ డాన్స్ కి ప్రపంచ స్థాయిలో ఏ లెవల్ ఆదరణ ఉందనేది నాటు నాటు సాంగ్ ప్రూవ్ చేసింది. ఇండియాలో బెస్ట్ డాన్స్ హీరోలలో హృతిక్ రోషన్ కూడా ఒకడు. అతను సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కచ్చితంగా డాన్స్ నెంబర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు.

ఆయన డాన్స్ లో ఇంటరెస్టింగ్ స్టైల్ ఉంటుంది. దానిని చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడుతూ ఉంటారు. సౌత్ లో ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్స్ లలో ఒకడిగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు హిందీలో వార్ 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ మూవీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ బిజీ కారణంగా వార్ 2కి డేట్స్ కేటాయించలేదు.

దేవర కంప్లీట్ అయిన వెంటనే వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడు. వార్ 2లో తారక్ కాస్తా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. కానీ తారక్ కి కూడా ఒక హీరోయిన్ మూవీలో ఉంటుందంట. అలాగే ఈ సినిమాలో హృతిక్ రోషన్, తారక్ కలిసి డాన్స్ చేసే సాంగ్స్ ఉండనున్నాయంట.

ఇండియాలోనే ఇద్దరు టాప్ స్టార్స్, అది కూడా డాన్స్ ఐకాన్ లాంటి వారు కలిసి స్టెప్పులు వేస్తే చూసేవారికి రెండు కళ్ళుసరిపోవు. మరి అలాంటి దృశ్యాన్ని వార్ 2లో చూసే అవకాశం ఉందని బిటౌన్ లో వినిపిస్తోన్న టాక్. అదే జరిగితే నాటు నాటు రేంజ్ లోనే ఆ సాంగ్ కూడా వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

హృతిక్ రోషన్ తాజాగా ఫైటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. నెక్స్ట్ వార్ 2పైన పూర్తిస్థాయిలో ఫోకస్ చేశాడు. అది కంప్లీట్ అయ్యాక క్రిష్ సిరీస్ లో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తారక్ దేవర కంప్లీట్ చేసి వార్ 2 షూటింగ్ లో చేరుతాడు. దాంతో పాటు దేవర పార్ట్ 2 కూడా ఫినిష్ చేసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉందంట.