Begin typing your search above and press return to search.

టైగ‌ర్ 3లో ఎన్టీఆర్ నిజ‌మా?

అయితే వార్ 2 రిలీజ్ కంటే ముందే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రో బాలీవుడ్ సినిమాలో నటించాడు అంటూ ప్ర‌చారం సాగుతోంది

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:56 PM GMT
టైగ‌ర్ 3లో ఎన్టీఆర్ నిజ‌మా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫాలోయింగ్ ని పెంచుకున్న ఎన్టీఆర్ త‌దుప‌రి హృతిక్ రోష‌న్ తో క‌లిసి య‌ష్ రాజ్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న 'వార్ 2'లో న‌టిస్తున్నాడు. జ‌న‌వ‌రిలో తార‌క్, హృతిక్ సెట్స్ లో జాయిన్ కానున్నారు. ఇటీవ‌ల ఆ ఇద్ద‌రూ అవ‌ర‌సం లేని సీన్ల‌ను ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్నారు.

అయితే వార్ 2 రిలీజ్ కంటే ముందే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రో బాలీవుడ్ సినిమాలో నటించాడు అంటూ ప్ర‌చారం సాగుతోంది. స‌ల్మాన్ ఖాన్ న‌టించిన టైగ‌ర్ 3లో ఎన్టీఆర్ మెరుపులా మెరిసేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో షారూఖ్-హృతిక్ రోష‌న్ కూడా క‌నిపించ‌నున్నారు. షారూఖ్ ఈ చిత్రంలో ప‌ఠాన్ గా ద‌ర్శ‌నమిస్తాడు. అత‌డి పాత్ర సుమారు పావుగంట పాటు ఉంటుంది. కానీ హృతిక్ .. ఎన్టీఆర్ పాత్ర‌లు ఇలా వ‌చ్చి అలా వెళ‌తాయ‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

అయితే ఇందులో నిజం లేద‌ని కూడా ఒక సెక్ష‌న్ మీడియా వాదిస్తోంది. ఎన్టీఆర్ పేరును ఉప‌యోగించుకుని సౌత్ లో హైప్ క్రియేట్ చేసేందుకు అత‌డి పేరును ఉప‌యోగిస్తున్నార‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా కానీ మ‌రో రెండు రోజుల్లో టైగ‌ర్ 3 విడుద‌ల‌వుతున్నందున దీనిపై క్లారిటీ రానుంది. టైగ‌ర్ - వార్ - ప‌ఠాన్ సిరీస్ ల‌లో పాత్ర‌ల‌ను క‌లుపుతూ స్పై యూనివ‌ర్శ్ లో త‌దుప‌రి భారీ చిత్రాల‌ను నిర్మించేందుకు య‌ష్ రాజ్ బ్యాన‌ర్ సిద్ధంగా ఉంది. భ‌విష్య‌త్ సినిమాల‌కు హైప్ పెంచేందుకు కూడా వీటిలో న‌టిస్తున్న హీరోల అతిథి పాత్ర‌ల‌ను చాలా ముందే ఆడియెన్ కి ప‌రిచ‌యం చేస్తున్నార‌ని కూడా టాక్ ఉంది. ఒక‌వేళ ఇదే అనుస‌రిస్తే టైగ‌ర్ 3లో ఎన్టీఆర్ క‌నిపించే వీలుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. కానీ దీనికి అధికారికంగా ఎలాంటి ధృవీక‌ర‌ణ లేదు.

స‌ల్మాన్ కెరీర్ లో టైగ‌ర్ 3 అతిపెద్ద పాన్ ఇండియా రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. ఈ సినిమాని తెలుగులోను పెద్ద ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. అయితే హిందీలో ఉన్నంత హైప్ తెలుగులో లేదు. కేవ‌లం ముంద‌స్తు బుకింగులు యావ‌రేజ్ అన్న టాక్ వినిపిస్తోంది. షారూఖ్ ఖాన్ జ‌వాన్, ప‌ఠాన్ ల‌తో పోలిస్తే త‌క్కువ రేంజులోనే టైగ‌ర్ ఉన్నాడ‌న్న టాక్ వినిపించ‌డం కొంత ఇబ్బందిక‌రం.

టైగ‌ర్ 3 సెన్సార్ రిపోర్ట్:

స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా మనీష్ శర్మ దర్శకత్వం వహించిన టైగ‌ర్ 3 ఈ దీపావళి కానుక‌గా అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి U/A (12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల విచక్షణతో అపరిమితం) సర్టిఫికేషన్‌ను అందుకుంది. ఎలాంటి కోతలు లేకుండా సెన్సార్ క్లియర్ అయింద‌ని తెలిసింది. విజువల్ కట్స్ లేకుండా సినిమా CBFC నుండి క్లియరెన్స్ పొందినప్పటికీ, సర్టిఫికేషన్ బాడీ ఉపశీర్షికలకు సవరణలను కోరారు. RAW (పరిశోధన - విశ్లేషణ విభాగం)ని సూచించే సినిమాలోని డైలాగ్‌లు మార్చాల‌ని కోరింది. RAWకి బదులుగా R&AW అనే మార్పును సూచించింది.

సినిమా మాట‌ల్లో బేవాకూఫ్ ని మూర్ఖత్వం అని `మష్రూఫ్`ని బిజీ అని భర్తీ చేయాలని చిత్రనిర్మాతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సర్దుబాట్లను అనుసరించి యుఏ సర్టిఫికేట్ ను పొందింది. జాతీయ గీతానికి సంబంధించిన సవరణ అభ్యర్థన మేరకు మేనేజ్ చేసార‌ని స‌మాచారం. సినిమా రన్ టైమ్ 153 నిమిషాలు.

టైగర్ 3 లో స‌ల్మాన్- కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో న‌టించ‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా న‌టించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న విడుదలవుతోంది.