Begin typing your search above and press return to search.

ఎన్ఠీఆర్ వద్దంటే ఈమధ్య డిజాస్టర్లే.. మరి RC 16?

నువ్వే కావాలి సినిమా పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకొని తరువాత తరుణ్ తో చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆ సినిమా సెట్ కాదని ఆపేశారు

By:  Tupaki Desk   |   7 March 2024 4:53 AM GMT
ఎన్ఠీఆర్ వద్దంటే ఈమధ్య డిజాస్టర్లే.. మరి RC 16?
X

డైరెక్టర్ ఒక హీరో కోసం కథ రాసుకొని వేరొక హీరోతో చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమాని ముందుగా సూపర్ స్టార్ కృష్ణతో చేద్దామని పరుచూరి బ్రదర్స్ అనుకున్నారంట. అయితే అది మెగాస్టార్ చేతికి రావడం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు చిరంజీవి ఇమేజ్ ని అమాంతం మార్చేసింది. అలాగే ఇతర హీరోల కెరియర్ లో కూడా అలాంటి మూవీస్ చాలా ఉంటాయి.

నువ్వే కావాలి సినిమా పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకొని తరువాత తరుణ్ తో చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆ సినిమా సెట్ కాదని ఆపేశారు. అలాగే కొంతమంది హీరోలు కథలు నచ్చక వద్దనుకున్న సినిమాలని వేరొక హీరో చేసి డిజాస్టర్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీస్ కూడా ఉన్నాయి. జూనియర్ ఎన్ఠీఆర్ కెరియర్ లో వదులుకున్న సినిమాలలో హిట్ అయినవి కొన్ని ఉండగా డిజాస్టర్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి.

ఆర్య సినిమా కథని సుకుమార్ ముందు ఎన్టీఆర్ కి వినిపించాడంట. కథ నచ్చిన తనకి సెట్ కాదని తారక్ వదిలేశాడు. అదే సినిమాని బన్నీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే బొమ్మరిల్లు మూవీ కూడా తన ఇమేజ్ కి సరిపోయే కథ కాదని రిజక్ట్ చేస్తే సిద్ధార్ధ్ ఆ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా నిలబడటానికి బొమ్మరిల్లు ఎంతో ఉపయోగపడింది.

బోయపాటి శ్రీను భద్ర స్టోరీని తారక్ కి చెప్పాడంట. మరి ఎందుకనో జూనియర్ ఎన్టీఆర్ ఆ మూవీ చేయలేకపోయాడు. రవితేజ ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు. అలాగే సురేందర్ రెడ్డి కిక్ మూవీ కథని జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించిన ఫైనల్ గా రవితేజ చేతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ మధ్యకాలంలో తారక్ రిజక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం మూవీ నితిన్ చేసి డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.

పూరి జగన్నాథ్ కూడా తారక్ కోసం టెంపర్ తరువాత రెండు కథలు వినిపంచాడు. ఇస్మార్ట్ కంటే ముందే చర్చలు జరిగాయి. అంటే అంతకుముందు ఐదేళ్ళలో పూరి చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల మహేష్ తో గుంటూరు కారం మూవీతో వచ్చాడు. ఈ మూవీ కథని ముందుగా తారక్ కి వినిపించాడంట. అతను ఆర్ఆర్ఆర్ పైన ఫోకస్ చేయడంతో త్రివిక్రమ్ కి నో చెప్పాడు. అదే కథకి కొద్దిగా మార్చి మహేష్ తో చేసి త్రివిక్రమ్ డిజాస్టర్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమా నిజానికి తారక్ చేయాల్సి ఉంది. ఆ కథ ఎన్టీఆర్ కి నచ్చింది. చాలా రోజులు స్క్రిప్ట్ పై కూర్చున్న బుచ్చిబాబు తారక్ కోసం ఎదురు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడంతో ఆ దర్శకుడు రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళాడు. మరి ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది చూడాలి.