Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, చరణ్‌ ఫ్యాన్స్ మధ్య కొత్త పంచాయితీ!

ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు నటించి తమ నటనతో పాన్ వరల్డ్‌ సినీ ప్రేమికులను అలరించారు

By:  Tupaki Desk   |   24 Aug 2023 3:00 PM IST
ఎన్టీఆర్, చరణ్‌ ఫ్యాన్స్ మధ్య కొత్త పంచాయితీ!
X

తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి అద్భుతమైన విజువల్ వండర్ ను అందిండచంతో పాటు నాటు నాటు అంటూ ఏకంగా ఆస్కార్‌ అవార్డును కూడా తీసుకు వచ్చి తెలుగు వారి ఖ్యాతిని, కీర్తిని రెపరెపలాడించడం జరిగింది. దేశంలోనే కాకుండా, దేశం బయట కూడా రాజమౌళి సినిమా అంటే ఆదరణ పెరిగింది.

ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు నటించి తమ నటనతో పాన్ వరల్డ్‌ సినీ ప్రేమికులను అలరించారు. సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ ఫ్యాన్స్ తెగ హడావిడి చేయడం జరిగింది. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేయడంతో పాటు కొందరు ఫ్యాన్స్ గొడవకి దిగారు.

సినిమా లో మా హీరో కి ఎక్కువ ప్రాముఖ్య దక్కింది అంటే లేదు మా హీరోనే బెస్ట్‌ సన్నివేశాల్లో నటించాడు, అద్భుతమైన సన్నివేశాల్లో నటించాడు అంటూ గొడవ పడటం జరిగింది. ఆ వివాదం ఫ్యాన్స్ మధ్య ఇంకా రగులుకుంటూనే ఉంది. తాజాగా మరోసారి ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వివాదం మొదలైంది.

ఈసారి జాతీయ అవార్డుకు సంబంధించిన ప్రకటన నేపథ్యం లో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో గొడవకు దిగుతున్నారు. మా హీరోకు మాత్రమే జాతీయ అవార్డు వస్తుందని కొందరు అంటే కొందరు మా హీరోకు జాతీయ అవార్డు వస్తుందని కొందరు వాదిస్తూ సోషల్‌ మీడియాలో గొడవ పడుతున్నారు. ఈ కొత్త పంచాయితీ ఎంత దూరం వెళ్లేనో చూడాలి.