Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్ట్‌ లో 'దేవర' ఏం చేస్తున్నాడు?

వైట్ టీ షర్ట్‌ అండ్ బ్లాక్ పాయింట్‌ లో ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్‌ లో సందడి చేశారు. ఆయన హైదరాబాద్‌ నుంచి గోవా చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 9:33 AM GMT
ఎయిర్ పోర్ట్‌ లో దేవర ఏం చేస్తున్నాడు?
X

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ లో కనిపించడంతో అక్కడే ఉన్న మీడియా వారు తమ కెమెరాలకు పని చెప్పారు. ఎప్పటిలాగే ఎన్టీఆర్‌ చాలా స్టైల్ అండ్ హ్యాండ్సమ్‌ లుక్ లో ఆకట్టుకునే విధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఆయన కొత్త ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

వైట్ టీ షర్ట్‌ అండ్ బ్లాక్ పాయింట్‌ లో ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్‌ లో సందడి చేశారు. ఆయన హైదరాబాద్‌ నుంచి గోవా చేరుకున్నారు. దేవర షూటింగ్ ను దర్శకుడు కొరటాల శివ గోవాలో ప్లాన్‌ చేసినట్లుగా ఇటీవలే మనం మాట్లాడుకున్నాం. అక్కడ జాన్వీ కపూర్‌ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్‌ అక్కడకు చేరుకున్నాడు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

జాన్వీ కపూర్‌ ఇప్పటికే హైదరాబాద్‌ లో జరిగిన కొన్ని రోజుల షూటింగ్‌ కు హాజరు అయింది. అయితే పూర్తి స్థాయిలో ఆమె ఎన్టీఆర్‌ తో సన్నివేశాల చిత్రీకరణ లో పాల్గొన్నదే లేదు. ఇప్పుడు ఆమె గోవా షెడ్యూల్‌ తో ఎన్టీఆర్‌ తో రొమాంటిక్ కమ్‌ లవ్‌ సన్నివేశాల్లో కనిపించబోతుంది. అంతే కాకుండా ఇద్దరి కాంబోలో ఒక పాట కూడా చిత్రీకరణ చేయబోతున్నారని సమాచారం అందుతోంది.

దేవర సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించాడు. మొదటి పార్ట్‌ షూటింగ్ కి సంబంధించి జనవరి లేదా ఫిబ్రవరి వరకు పూర్తి చేయాలని.. ముందుగా అనుకున్న ప్రకారం సమ్మర్ ఆరంభం లోనే సినిమాను విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడు.

హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ ఇప్పటి వరకు హిందీ లో చాలా సినిమా లు చేసింది. కానీ వాటిల్లో ఏ ఒక్కటి కూడా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. కానీ టాలీవుడ్‌ లో మాత్రం ఏకంగా ఎన్టీఆర్ సినిమా లో నటించే అవకాశం రావడం తో ఈ అమ్మడు కచ్చితంగా ఇక్కడ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.