Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమా.. 150 రోజుల వర్క్.. ఇది లెక్క..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:47 AM GMT
ఎన్టీఆర్ సినిమా.. 150 రోజుల వర్క్.. ఇది లెక్క..!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తారని తెలుస్తుంది. వార్ 2 కోసం జనవరి 2024 నుంచి రెండు నెలలు.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం మార్చి నుంచి డేట్స్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. సలార్ 1 రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కోసం వర్క్ చేయాల్సి ఉంది. సలార్ 1 రిలీజైన నెక్స్ట్ డే నుంచి ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతారని తెలుస్తుంది.

సాధారణంగా నీల్ ఏదైనా సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేయాలంటే 5 నెలలు టైం తీసుకుంటారట. 150 రోజుల్లో తను అనుకున్న కథను స్క్రీన్ ప్లేతో సహా సిద్ధం చేసి రెడీ చేస్తారట. సలార్ 1 పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా కోసం డిసెంబర్ నుంచి స్క్రిప్ట్ రాసే ఆలోచనలో ఉన్నారట. ఆల్రెడీ కె.జి.ఎఫ్ 1, 2 తో తన టాలెంట్ చూపించిన ప్రశాంత్ నీల్ సలార్ 1 తో కూడా సత్తా చాటితే ఎన్టీఆర్ సినిమా మీద భారీ హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

ఆ అంచనాలను అందుకునేలా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం అద్భుతమైన కథ రెడీ చేస్తున్నారట. సలార్ 1 తోనే సెన్సేషన్ రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్న ప్రశాంత్ నీల్ తారక్ సినిమాతో దాన్ని మించే రికార్డుల మీద కన్నేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ కూడా నీల్ తో సినిమా చేసేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడు. కె.జి.ఎఫ్ 1 అండ్ 2 లో గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ సలార్ లో కోల్ మైన్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తుంది.

మరి ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. దేవర సినిమాతో ఎన్టీఆర్ తన దమ్ము చూపించడానికి రెడీ అవుతుండగా నీల్ సినిమాతో నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించాలని ఉత్సాహంగా ఉన్నాడు తారక్. దేవర 2 పార్టులుగా వస్తుండగా వార్ 2 లో కూడా భాగం అవుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో కూడా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడని అర్థమవుతుంది. సో రాబోయే ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఫెస్టివల్ టైం అనే చెప్పొచ్చు.