Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ అదేనా..!

ముందు సలార్ 2 చేస్తాడా లేదా ఎన్టీఆర్ సినిమా మొదలు పెడతాడా ఈ రెండిటినీ పక్కన పెట్టి యష్ తో కె.జి.ఎఫ్ 3 మొదలు పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 1:30 AM GMT
ఎన్టీఆర్ తో కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ అదేనా..!
X

KGF రెండు పార్టుల తర్వాత KGF 3 కూడా ఉంటుందని షాక్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ దాన్ని పక్కన పెట్టి ప్రభాస్ తో సలార్ మొదలు పెట్టి ఆ సినిమా పార్ట్ 1 తీసి వదిలాడు. సలార్ 1 తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 చేస్తాడని కొందరు అంటుంటే తను ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా గురించి కూడా పనులు మొదలు పెడుతున్నాడని టాక్. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ముందు సలార్ 2 చేస్తాడా లేదా ఎన్టీఆర్ సినిమా మొదలు పెడతాడా ఈ రెండిటినీ పక్కన పెట్టి యష్ తో కె.జి.ఎఫ్ 3 మొదలు పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎప్పుడు మొదలైనా సరే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేసే సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ 1, 2 తరహాలోనే ప్రభాస్ తో సలార్ కూడా రెండు భాగాలుగా చేస్తున్న ప్రశాంత్ ఆ తర్వాత వచ్చే ఎన్టీఆర్ సినిమాను కూడా అదే పంథాలో టూ పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

కె.జి.ఎఫ్ 3కి కొంత టైం ఉండేలా కనిపిస్తుండగా ఈలోగా సలార్ 2ని ఫినిష్ చేసి ఆ తర్వాత KGF 3 ఆ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా ఎన్టీఆర్ దేవర రెండు భాగాలు వార్ 2 ఇలా తారక్ కూడా తను కమిటైన సినిమాలు పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాకు రెడీ అవుతాడని అంటున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఈ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కె.జి.ఎఫ్ సినిమాను గోల్డ్ మైన్స్ లో.. సలార్ ని కోల్ మైన్స్ లో తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఎలాంటి బ్యాక్ డ్రాప్ కథతో వస్తారా అన్నది చూడాలి.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని సూపర్ ఖుషి చేస్తుంది. ప్రస్తుతం దేవర సెట్స్ మీద ఉండగా త్వరలో హృతిక్ రోషన్ తో సినిమాను కూడా మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ సినిమా భారీ రేంజ్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2025 సెకండ్ హాఫ్ లో ఆ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.