Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ - ఎన్టీఆర్.. ఇంతకంటే ఏం కావాలి!

మోక్షజ్ఞ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే మరొక నందమూరి అబ్బాయి కూడా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 7:30 AM GMT
మోక్షజ్ఞ - ఎన్టీఆర్.. ఇంతకంటే ఏం కావాలి!
X

నందమూరి ఫ్యామిలీ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారి ఫ్యామిలీ వేడుకలు జరిగితే మాత్రం అందరి ఫోకస్ వారిపైనే ఉంటుంది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు. ఇక బాలయ్య బాబు తనదైన శైలిలో మాస్ ఫాలోయింగ్ తో ముందుకు కొనసాగుతున్నారు.


కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. ఇక నెక్స్ట్ రాబోయే నందమూరి అబ్బాయి మోక్షజ్ఞ పైనే మరింత ఫోకస్ పడుతోంది. అతను ఎప్పుడూ వెండితెరపై కనిపిస్తాడా అని ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి మోక్షజ్ఞ ఇద్దరినీ కూడా ఒకే ఫ్రేమ్ లో చూడాలి అనే కోరిక కూడా చాలా మంది ఫ్యాన్స్ లో ఉంది.

అయితే వెండితెరపై కంటే ముందు సాధారణంగా ఇద్దరు అసలు మాట్లాడకుంటారా అని సందేహాలు కూడా చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్కు మధ్యలో చాలా గ్యాప్ ఉంది అనే విధంగా కూడా గతంలో గాసిప్స్ అయితే వచ్చాయి. ఇక వాటన్నిటి గురించి పక్కన పెడితే ఇంటీవల ఫ్యామిలీ ఫంక్షన్ లో మొట్టమొదటిసారి ఫ్యాన్స్ కు అయితే ఒక మంచి ఆనందాన్ని ఇచ్చే మూమెంట్ అయితే కనిపించింది.

ప్రస్తుతం నందమూరి బ్రదర్స్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందులో మోక్షజ్ఞ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే మరొక నందమూరి అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ నలుగురి ఫోటో ఇప్పుడు ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే మరొక లీక్ అయిన వీడియోలో ఫంక్షన్ లో కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ లతో అలాగే సోదరులతో కలిసి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

బాలకృష్ణ అక్కడ లేరు కానీ ఆ వీడియో లో మోక్షజ్ఞ కూడా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ చెప్పే మాటలను జాగ్రత్తగా వింటున్నాడు. ఇంకా చాలామంది నందమూరి వారసులు ఆ వేడుకలో ఉన్నప్పటికీ.. వీరు ప్రత్యేకంగా మాట్లాడుకున్న ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక మొత్తానికి మోక్షజ్ఞ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్ని ఇస్తుంది.