Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. ఎక్కడికి ఈ హఠాత్తు పయనం!

జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి రెండేళ్ళు దాటి పోయింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా 2022లో వచ్చింది

By:  Tupaki Desk   |   14 May 2024 3:06 PM GMT
ఎన్టీఆర్.. ఎక్కడికి ఈ హఠాత్తు పయనం!
X

జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి రెండేళ్ళు దాటి పోయింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా 2022లో వచ్చింది. ఆ తరువాత ఓ గెస్ట్ రోల్ కూడా చేసింది లేదు. దీంతో ఫ్యాన్స్ అయితే తారక్ ను చాలా మిస్సవుతున్నారు. నెక్స్ట్ వచ్చే సినిమా అంచనాలకు మించి ఉండాలని తారక్ తీసుకుంటున్న జాగ్రత్తల వల్లనే బిగ్ స్క్రీన్ కు కాస్త గ్యాప్ ఎక్కువైంది. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా కోసమే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు తారక్ వార్ 2 సినిమా షూటింగ్ లో కూడా ఇటీవల పాల్గొన్నాడు. గ్యాప్ లేకుండా రెస్ట్ తీసుకోకుండా వరుస షూటింగ్స్ తో బిజీ అయిన తారక్ మళ్ళీ కొంత బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు సిద్ధమయ్యారు. మే 20వ తేదీన తారక్ 41 వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక అందుకే విదేశాలకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు.

మంగళవారం తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్ అక్కడ మీడియా ఫోటోగ్రఫర్స్ ను సరదాగా పలకరించారు. పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కొన్ని రోజులు ఫ్యామిలీ తో విశ్రాంతి తీసుకోబోతున్నట్లు అర్ధమవుతుంది. అసలే వార్ 2 సినిమా యాక్షన్ సీన్స్ తో కూడుకున్నది. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మొదటి షెడ్యూల్ లోనే ఎన్టీఆర్ కొన్ని హార్డ్ సీన్స్ లో నటించారు.

ఇక రీసెంట్ గా షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇక మరుసటి రోజే విదేశాలకు పయనమయ్యారు. ఇక మళ్ళీ బర్త్ డే అనంతరం హైదరాబాద్ కు రానున్న ఎన్టీఆర్ దేవర సినిమా పనుల్లో బిజీ కానున్నాడు. ఒక లాంగ్ షెడ్యూల్ తో ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తరువాత వార్ 2 షూటింగ్ తో బిజీ కానున్నాడు.

ఇక దేవర సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ఎన్టీఆర్ పుట్టినరోజు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక దేవర రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.