Begin typing your search above and press return to search.

భగవంత్​ కేసరితో ఎన్టీఆర్​ ఫ్యాన్స్​కు సమస్యేంటి?

ఇందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైలెంట్​గా ఉండడమే అనే చర్చ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 11:57 AM GMT
భగవంత్​ కేసరితో ఎన్టీఆర్​ ఫ్యాన్స్​కు సమస్యేంటి?
X

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి నేడు(అక్టోబర్ 19)న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియా అంతా పాజిటివ్ రెస్పాన్స్​తో ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. అయితే షాకింగ్ విషయమేమిటంటే.. ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ దూరంగా ఉన్నారని తెలిసింది. లేదంటే రెస్పాన్స్​ మరింత ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళితే.. భగవంత్ కేసరి మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేసింది. ఎందుకంటే బాలయ్య లాంటి మాస్​ హీరోను డీల్​ చేసింది ఫన్​ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్‌ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి.. తన శైలికి కొంచెం భిన్నంగా సినిమా తీస్తున్నట్లు, బాలయ్యను నెవర్ బిఫోర్ స్టైల్​లో చూపించబోతున్నట్లు చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే.. విడుదలైన టీజర్, పాటలు, ఇతర ప్రచార చిత్రాలు.. బాగానే ఆకట్టుకున్నాయి.

కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో కనపడకపోవడం కాస్త షాక్​కు గురి చేసింది. బాలయ్య గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డిల కన్నా తక్కువగా కనిపించింది. విడుదలకు ముందు రోజు కూడా సోల్డ్ ఔట్ షోలు చాలా తక్కువ. ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్న షోలు కూడా అంతే! ఇందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైలెంట్​గా ఉండడమే అనే చర్చ వినిపిస్తోంది.

బాలయ్యకు, తారక్‌కు మధ్య చాలా ఏళ్ల నుంచి విభేదాలు ఉన్నట్లు ప్రచారం ఉన్నా... వీరిద్దరిలో ఎవరి సినిమా విడుదలైన రెండు వర్గాల అభిమానులు ఒక్కటై సినిమాను భుజానికి ఎత్తుకుంటారు. కానీ రీసెంట్​గా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎన్టీఆర్​ గురించి బాలయ్య డోంట్ కేర్ అనడం వంటివి.. యంగ్ టైగర్​ ఫ్యాన్స్​ను హర్ట్​ చేసిందని తెలిసింది.

అందుకే భగవంత్ కేసరికి దూరంగా ఉన్నారని టాక్​. పైగా చంద్రబాబు అరెస్ట్‌తో నిరాశలో ఉన్నతేదేపా కార్యకర్తలు కూడా బాలయ్య సినిమా పట్ల అంతగా ఉత్సాహం చూపించట్లేదట. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి పరిస్థితి మారొచ్చని అనుకుంటున్నారు.