Begin typing your search above and press return to search.

మ‌హేష్ త‌ర్వాత కాల‌రెగ‌రేసిన మొన‌గాడు!

హిట్ కొడుతున్నామ‌ని కాల‌రేగ‌రేసి చెప్పేద‌మ్ము కొంత మంది హీరోల‌కే ఉంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు

By:  Tupaki Desk   |   9 April 2024 11:54 AM GMT
మ‌హేష్ త‌ర్వాత కాల‌రెగ‌రేసిన మొన‌గాడు!
X

హిట్ కొడుతున్నామ‌ని కాల‌రేగ‌రేసి చెప్పేద‌మ్ము కొంత మంది హీరోల‌కే ఉంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అలా తొలిసారి ఇండ‌స్ట్రీలో కాల‌రేగ‌రేసి హిట్ కొట్టామ‌ని కాల‌రెగ‌రేసిన హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌. ఆయ‌న క‌థ‌నాయ‌కుడిగా న‌టించిన 'మ‌హ‌ర్షి' సినిమా విష‌యంలో ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. రిలీజ్ అయిన హిట్ అయిన అనంత‌రం విజ‌యోత్స‌వ స‌భ‌లో మ‌హేష్ కాల‌రేగ‌రేసి హిట్ కొట్టామ‌ని అభిమానుల‌కు చెప్పాడు. అప్ప‌టివ‌ర‌కూ ఎన్నో విజ‌యాలు మ‌హేష్ అందుకున్నాడు.

కానీ ఏ సినిమాకి కాల‌రేగ‌రేసింది లేదు. 'శ్రీమంతుడు' త‌ర్వాత మ‌హేష్ వ‌రుస‌గా రెండు ప్లాప్ లు చూసాడు. 'బ్ర‌హ్మోత్స‌వం'..'స్పైడ‌ర్' అట్ట‌ర్ ప్లాప్ చిత్రాలుగా నిలిచాయి. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన 'భ‌ర‌త్ అనే నేను' రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించింది. అటుపై 'మ‌హ‌ర్షి' రిలీజ్ అనంత‌రం కాల‌రెగ‌రేసే స‌మ‌యం రావ‌డంతో మీడియా ముందే త‌న రేంజ్ ఇది అని మ‌రోసారి చాటి చెప్పారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇండ‌స్ట్రీలో మ‌రో హీరో కాల‌రెగ‌రేసింది లేదు.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ‌రో సినిమ వేదిక‌పై దేవ‌ర‌ని ఉద్దేశించి కాల‌రెగ‌రేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ సినిమాపై యంగ్ టైగ‌ర్ ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడు అన్న‌ది తెలుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ తార‌క్ కూడా ఏ సినిమా విష‌యంలో ఇలాంటి ఛాన్స్ తీసుకుంది లేదు. తొలిసారి మ‌రోక‌రి సినిమా వేదిక‌పై కాల‌రెగ‌రేడ‌యం కాస్త చ‌ర్చ‌నీయాంశంగానూ మారింది. మ‌హేష్‌-తార‌క్ కాల‌రెగ‌రేయ‌డానికి ఇక్క‌డ చిన్న వ్య‌త్యాసం గ‌మ‌నించాలి. మ‌హేష్ హిట్ కొట్టిన త‌ర్వాత ఎగ‌రేసాడు.

కానీ తార‌క్ మాత్రం' దేవ‌ర' రిలీజ్ కి ముందే కాల‌రేగ‌రేసి చెప్పాడు హిట్ కొడ‌తాన‌ని.. కొట్టిన త‌ర్వాత అదే కాల‌ర్ మ‌ళ్లీ ఎగ‌రేసి కొట్టాన‌ని చెడుతాడు అన‌డంలో సందేహం లేదు. ఆ ర‌కంగా మ‌హేష్ -తార‌క్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారారు. ఇద్ద‌రు చాలా స‌ర‌దాగానూ ఉంటారు. మ‌హేష్ ని తార‌క్ అన్న అని అభిమానంతో పిలుస్తాడు. అదే అభిమానంతో మ‌హేష్.. తార‌క్ అని పిలుస్తాడు.