Begin typing your search above and press return to search.

దేవర : అప్పుడు పక్కా లోకల్‌.. ఈసారి పాన్‌ ఇండియా లెవల్‌

ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న మరో సినిమా ఇదే

By:  Tupaki Desk   |   3 Oct 2023 2:30 PM GMT
దేవర : అప్పుడు పక్కా లోకల్‌.. ఈసారి పాన్‌ ఇండియా లెవల్‌
X

ఎన్టీఆర్‌ ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఎన్టీఆర్‌ సినిమా చేస్తున్నాడు అంటే ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఆసక్తిగా చూసేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎన్టీఆర్‌ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కళ్లు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న మరో సినిమా ఇదే. దేవర సినిమా కోసం కొరటాల శివ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కోసం ఏడాది సమయం తీసుకున్న కొరటాల శివ మేకింగ్‌ విషయం లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కొరటాల గత చిత్రం ఆచార్య ఫ్లాప్ నేపథ్యం లో ఈ సినిమా పై అదనపు శ్రద్ధ చేసుకుంటున్నట్లుగా మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్‌ సినిమా లో కాజల్‌ తో పక్కా లోకల్‌ అంటూ ఐటం సాంగ్‌ ని చేయించిన విషయం తెల్సిందే. దేవర కోసం అంతకు మించి అన్నట్లుగా ఐటం సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది.

దేవర సినిమాలో ఐటం సాంగ్ ని బాలీవుడ్ స్టార్‌ క్రేజీ హీరోయిన్‌ తో చేయించబోతున్నారట. ఆ హీరోయిన్‌ కి పాన్ ఇండియా స్థాయి స్టార్‌ డమ్‌ ఉండటం తో దేవర సినిమా కి ఆమె క్రేజ్ హెల్ఫ్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. మొత్తానికి అప్పుడు పక్కా లోకల్‌ అంటూ వచ్చి సెన్షేషన్ క్రియేట్‌ చేసిన ఎన్టీఆర్‌, కొరటాల ఈసారి అంతకు మించి అన్నట్లుగా సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

దేవర సినిమాకి తమిళ్ సెన్షేషన్‌ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఐటం సాంగ్‌ కోసం మాంచి మాస్ మసాలా ట్యూన్స్ ని రెడీ చేశాడని.. కొరటాల, ఎన్టీఆర్ లు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే రికార్డింగ్ మొదలు పెట్టడమే అన్నట్లుగా సమాచారం అందుతోంది. రికార్డింగ్‌ మొదలు అయిన వెంటనే ఆ హీరోయిన్‌ ని రంగంలోకి దించబోతున్నారు. వచ్చే నెలలో ఆ ఐటం స్టార్‌ హీరోయిన్‌ ఎవరు అనేది క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.