Begin typing your search above and press return to search.

దేవర తర్వాత ఎన్టీఆర్ ప్లాన్ అదేనా..?

దేవర సినిమా విషయంలో ప్రతి యాస్పెక్ట్ లో సినిమా రేంజ్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:30 PM GMT
దేవర తర్వాత ఎన్టీఆర్ ప్లాన్ అదేనా..?
X

ట్రిపుల్ ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో దేవరగా రాబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తప్పకుండా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. కొరటాల శివ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో హీరో పాత్రలకు భిన్నంగా దేవర సినిమాలో తారక్ పాత్ర ఉంటుందని టాక్. రైటర్ గా, డైరెక్టర్ గా ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ మీద ఆచార్య ఒక బ్లాక్ మార్క్ పడేలా చేసింది. అందుకే దేవరతో సత్తా చాటాలని చూస్తున్నాడు.

దేవర సినిమా విషయంలో ప్రతి యాస్పెక్ట్ లో సినిమా రేంజ్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండేలా చూస్తున్నారు. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి.. యంగ్ టైగర్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరన్న ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో మొదలైంది. దేవర సినిమా మార్చిలో మొదలు కాగా ఇప్పటివరకు 40 శాతం పూర్తైనట్టు సమాచారం.

డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్. ఇక దేవర తర్వాత ఆల్రెడీ ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ మూవీ లైన్ లో ఉంది. ప్రశాంత్ నీల్ సలార్ 1 రిలీజ్ తర్వాత తారక్ తో సినిమా చేస్తారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత వార్ 2 కి డేట్స్ ఇవ్వనున్నాడు. ప్రశాంత్ నీల్, సిద్ధార్థ్ ఆనంద్ ఈ ఇద్దరు మేటి డైరెక్టర్స్ తో కలిసి ఎన్టీఆర్ పనిచేయనున్నారు. తారక్ తో ఒకసారి పనిచేసిన డైరెక్టర్ అతని టాలెంట్ చూసి అతనికి అభిమాని అవ్వడం ఖాయం.

ఎన్టీఆర్ 30వ సినిమా దేవరగా వస్తుండగా 31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తుంది. ఇక 32వ సినిమా వార్ 2 అవుతుంది. ఆ తర్వాత మరోసారి రాజమౌళితో సినిమా ఉంటుందని చెబుతున్నారు. అయితే జక్కన్న ప్రస్తుతం మహేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా కూడా 3 ఏళ్లు రెండు పార్టులుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అలా అయితే మళ్లీ ఎన్.టి.ఆర్ రాజమౌళి కలిసి పనిచేయడానికి ఎలా లేదన్నా మూడు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.