Begin typing your search above and press return to search.

23 ఏళ్ల కెరీర్.. 29 సినిమాల ప్రస్థానం.. శిఖరం ఎత్తుకి ఎన్టీఆర్..!

2001 లో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టిన తారక్ 23 ఏళ్ల సినీ ప్రస్థానంలో సృష్టించిన సంచలనాలు.. చేసిన పాత్రలు.. గెలిచిన హృదయాలు ఎన్నో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   16 Nov 2023 7:36 AM GMT
23 ఏళ్ల కెరీర్.. 29 సినిమాల ప్రస్థానం.. శిఖరం ఎత్తుకి ఎన్టీఆర్..!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు వరల్డ్ సినీ లవర్స్ అందరికీ తెలుసు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన ఎన్టీఆర్ చాలా తక్కువ టైం లోనే కెరీర్ లో పీక్స్ ని చూశాడు. మధ్యలో కొన్నాళ్లు కెరీర్ లో సందిగ్ద పరిస్థితి ఏర్పడినా టెంపర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చి వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు.


2001 లో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టిన తారక్ 23 ఏళ్ల సినీ ప్రస్థానంలో సృష్టించిన సంచలనాలు.. చేసిన పాత్రలు.. గెలిచిన హృదయాలు ఎన్నో ఉన్నాయి. తనదైన డైలాగ్ డిక్షన్, యాక్టింగ్, డ్యాన్స్ ఇలా దేనికదే ప్రత్యేకతగా చూపుతూ తన ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని సైతం మెప్పిస్తూ నట విశ్వరూపం చూపిస్తున్నాడు ఎన్టీఆర్.

నటుడిగా తనని తాను ఆవిష్కరించుకునే ప్రతి పాత్ర అతని కెరీర్ ని ఒక్కో మెట్టు ఏర్పరచేలా చేశాయి. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేసే నటులు చాలా తక్కువ మంది నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. ఇన్నాళ్లు తెలుగు సినిమాలు చేసి ఆ క్రేజ్ తోనే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న తారక్ లాస్ట్ ఇయర్ వచ్చిన RRR తో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ని సంపాదించుకున్నారు.

ఎంతో కమిట్మెంట్.. దానికి తగిన హార్డ్ వర్క్.. పట్టువదలని విశ్వాసం ఇవే తన అస్త్రాలుగా చేసుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు ఉండేలా తన ప్రయాణాన్ని తానే రాసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈ ప్రయాణంలో ఎన్నో కోట్ల ప్రేక్షక హృదయాలను గెలిచాడు. 23 ఏళ్ల కెరీర్ 29 సినిమాల ప్రస్థానంలో తన నటనతో ఎంతోమందిని తన అభిమానులుగా చేసుకున్న ఎన్టీఆర్ ఇదే ఫాంతో తన సినీ కెరీర్ కొనసాగించాలని ఎన్నో పాత్రలు వేసి ప్రేక్షకులను మరింత రంజింప చేయాలని ఆశిద్దాం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్ లో ఉన్నాయి.