Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వార్ 2.. ఎంత పనిచేసింది..?

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఇలాంటి ఒక బ్యాడ్ టైం ఉంది. టెంపర్ నుంచి ఆర్.ఆర్.ఆర్, దేవర 1 వరకు ఎన్టీఆర్ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు.

By:  Ramesh Boddu   |   19 Aug 2025 10:46 AM IST
ఎన్టీఆర్ వార్ 2.. ఎంత పనిచేసింది..?
X

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా హిట్లు, సక్సెస్ ఫుల్ సినిమాలు పడితేనే హ్యాపీ అనిపిస్తుంది. ఇటు ఫ్యాన్స్ కూడా తమ స్టార్ సూపర్ హిట్లు కొడుతుంటేనే సూపర్ జోష్ కనబరుస్తాయి. ఐతే హిట్ ఫాం కొనసాగిస్తున్నంత వరకు బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి ట్రాక్ తప్పితే మాత్రం రిస్క్ లో పడినట్టే అవుతుంది. స్టార్ కెరీర్ లో ఇలాంటి రిస్క్ ఫేజ్ లు చాలానే ఉంటాయి. ఏ సినిమా తీసినా హిట్ అయిన సందర్భాలు కొన్నైతే.. ఎంత కష్టపడి సినిమాలు చేసినా ఫ్లాపులు అవుతున్న పరిస్థితి ఉంటుంది.

ఎన్టీఆర్ కెరీర్ లోబ్యాడ్ టైం..

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా ఇలాంటి ఒక బ్యాడ్ టైం ఉంది. టెంపర్ నుంచి ఆర్.ఆర్.ఆర్, దేవర 1 వరకు ఎన్టీఆర్ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. టెంపర్ ముందు ఎన్టీఆర్ ఏ సినిమా తీసినా కూడా అది ఆడియన్స్ కి నచ్చలేదు. దాదాపు చాలా సినిమాలు ఎన్టీఆర్ ఈ బ్యాడ్ ఫేజ్ ని ఫేస్ చేశాడు. ఆ టైంలో వచ్చిన శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస, బాద్షా ఇలా అన్ని కూడా ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టేలా చేశాయి.

2016 లో పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమా వచ్చింది. ఆ సినిమా ఎన్టీఆర్ రేంజ్ ఏంటో తెలిసిఏలా చేసింది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో కూడా సక్సెస్ అయ్యింది. ఆ నెక్స్ట్ జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వీర రాఘవ ఇలా అన్నీ కూడా ఎన్టీఆర్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ సక్సెస్ లను ఎన్టీఆర్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ తో కలిసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ రేంజ్ హిట్..

ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 1 కూడా పర్వాలేదు అనిపించింది. ఎన్టీఆర్ రేంజ్ హిట్ కాకపోయినా కమర్షియల్ లెక్కల్లో చూస్తే అది సక్సెస్ అయినట్టే. ఐతే లేటెస్ట్ గా వచ్చిన వార్ 2 మాత్రం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో హృతిక్ రోషన్ కి ఈక్వల్ రోల్ లో ఎన్ టీ ఆర్ నటించాడు. కానీ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఎన్ టీ ఆర్ హిట్ మేనియాకు బిగ్ బ్రేక్ పడేలా చేసింది వార్ 2. ఐతే స్టార్ హీరోలకు ఒక సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా టెన్షన్ ఉంటుంది.

ఎన్టీఆర్ విషయంలో నెక్స్ట్ సినిమా చాలా క్రూషియల్ కానుంది. ఐతే నెక్స్ట్ తారక్ ప్రశాంత్ నీల్ తో వస్తున్నాడు. కె.జి.ఎఫ్ 1 అండ్ 2 సినిమాలతో అతనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ తో సలార్ 1 తో సత్తా చాటాడు. పవర్ హౌస్ లాంటి ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ సూపర్ కంబ్యాక్ కాదు బాక్సాఫీస్ షేక్ చేసేలా చేస్తాడని అంటున్నారు. మరి ఎన్టీఆర్ ఈ హిట్ బ్రేక్ ఒక్క సినిమాకేనా లేదా అన్నది ప్రశాంత్ నీల్ సినిమా వచ్చాక తెలుస్తుంది.