ఎన్టీఆర్ మళ్లీ అంత రిస్క్ చేస్తాడా?
ముందు నుంచి ఎన్టీఆర్‌ది పవర్ ఫుల్ రోల్ అంటూ పరిచయం చేసిన మేకర్స్ చివరికి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురై `వార్ 2`పై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు.
By: Tupaki Entertainment Desk | 17 Dec 2025 5:00 PM ISTజక్కన్న తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ `ఆర్ఆర్ఆర్`. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి మెన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ కలని నిజం చేసి కోట్లాది భారతీయుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకోవడం, హాలీవుడ్ డైరెక్టర్స్ దృష్టిని ఆకర్షించడం తెలిసిందే. ఆ క్రేజ్‌తో బాలీవుడ్ మేకర్స్ ఎన్టీఆర్ వెంటపడ్డారు.
అలా ఎన్టీఆర్‌తో `వార్ 2` చేయించారు. బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ కంపనీ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్‌ని నిర్మించింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటించగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ భాషలోనూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఎన్టీఆర్ అభిమానులకు షాక్ ఇచ్చింది.
ముందు నుంచి ఎన్టీఆర్‌ది పవర్ ఫుల్ రోల్ అంటూ పరిచయం చేసిన మేకర్స్ చివరికి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురై `వార్ 2`పై తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన `వార్ 2` డిజాస్టర్ అనిపించుకుంది. రూ.300 పైచిలుకు బడ్జెట్‌తో నిర్మిస్తే అంతకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌లు రాబట్టలేక చతికిల పడిపోయి మేకర్స్‌కి భారీ నష్టాలని మిగిల్చింది. దీంతో `వార్ 2` అంగీకరించి ఎన్టీఆర్ తప్పు చేశాడని ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఫీలయ్యారు.
ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పేరుతో రిస్క్ చేశాడని, మళ్లీ అలాంటి తప్పు చేయొద్దని కామెంట్‌లు చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మళ్లీ అదే రిస్క్ చేయబోతున్నాడా? ...బాలీవుడ్ సినిమా పేరుతో మళ్లీ కెరీర్‌ని రిస్క్‌లో పెట్టబోతున్నాడా? అంటే అవుననే వార్తలు జోరందుకున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ మరోసారి బాలీవుడ్ మూవీలో నటించబోతున్నాడని జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తరవ్లో షారుక్ ఖాన్‌తో `పఠాన్ 2`ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులోని ఓ పవర్‌ఫుల్ రోల్‌ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మేకర్స్ ఆఫర్ చేశారని ప్రచారం మొదలైంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్లీ `వార్ 2` తరహాలో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా? అని అంతా కంగారు పడుతున్నారట. ఈ వార్తలో నిజమెంతన్నది తెలియాలంటే యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఫ్యాన్స్ కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎన్టీఆర్ మళ్లీ రిస్క్ చేస్తాడా?. వెయిట్ అండ్ సీ.
