Begin typing your search above and press return to search.

లెనిన్ కు తారక్ టచ్.. రిలీజ్‌కు ముందు హైప్ డబుల్!

ఏజెంట్ తర్వాత బలమైన కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జులై 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 July 2026 5:32 PM IST
లెనిన్ కు తారక్ టచ్.. రిలీజ్‌కు ముందు హైప్ డబుల్!
X

ఏజెంట్ తర్వాత బలమైన కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జులై 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఆల్రెడీ రిలీజైన టీజ‌ర్, సాంగ్స్, ట్రైల‌ర్ తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్న వేళ, మేక‌ర్స్ ఇచ్చిన తాజా అప్‌డేట్ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.




ముందుగా మేక‌ర్స్ టైటిల్ లోగో తో పాటూ పులి రూపాన్ని చూపిస్తూ ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేయ‌గా, త‌ర్వాత అస‌లు స‌ర్‌ప్రైజ్ ను వెల్ల‌డించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ సినిమాలో శ్రీరామపురం, భారతం మిట్ట అనే రెండు ప్రధాన ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేసే వాయిస్ ఓవర్ ను అందించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఓ స్టూడియోలో వాయిస్ ఓవర్ చెబుతున్న ఫోటోల‌తోపాటు, అఖిల్ తార‌క్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఫోటోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు ఎన్టీఆర్ వంటి గంభీరమైన వాయిస్ దొరకడం సినిమాకు అదనపు బలమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కథ ప్రారంభంలోనే ఎన్టీఆర్ వాయిస్ ప్రేక్షకులను సినిమాలోని ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు.




సోషల్ మీడియాలో కూడా ఈ అప్‌డేట్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పవర్‌ఫుల్ కథకు పవర్‌ఫుల్ వాయిస్ కావాలంటే తారక్‌నే సరైన ఎంపిక అని కొంద‌రు కామెంట్స్ చేస్తుంటే, ఎన్టీఆర్ ఇంట్రోతో సినిమా ఓపెనింగ్ మరింత ఎలివేట్ అవుతుందంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని, నందమూరి అభిమానులు ఈ కలయికను ప్రత్యేకంగా స్వాగతిస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో కూడా అఖిల్‌కు తన మద్దతు తెలియజేశారు. అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై అఖిల్ ను ప్రోత్సహించారు. ఇప్పుడు లెనిన్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా మరోసారి తన సపోర్ట్‌ను చాటారు. ఈ పరిణామం రెండు స్టార్ కుటుంబాల అభిమానుల్లో కూడా సానుకూల చర్చకు దారితీసింది.

చిత్తూరు బ్యాక్ డ్రాప్ సాగే ఈ సినిమాలో అఖిల్ విభిన్నమైన, తీవ్ర భావోద్వేగాలతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్‌కు కేవలం కొద్ది రోజులే మిగిలి ఉండగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనౌన్స్‌మెంట్ తో లెనిన్ ప్రమోషన్స్‌కు మరింత ఊపు వచ్చింది. అఖిల్ కెరీర్‌కు ఈ సినిమా కీలక మలుపు అవుతుందా? ఎన్టీఆర్ వాయిస్ సినిమా ఎమోషన్‌ను ఎంతవరకు ఎలివేట్ చేస్తుంది? అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.