ఎన్టీఆర్ తో ముందెవరు..?
దేవర తో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసినా కూడా తను సంతృప్తి చెందని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో ఫ్యాన్స్ ఆకలితో పాటు తన ఆకలి తీర్చాలని చూస్తున్నాడు.
By: Tupaki Desk | 28 Nov 2025 11:27 AM ISTదేవర తో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసినా కూడా తను సంతృప్తి చెందని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో ఫ్యాన్స్ ఆకలితో పాటు తన ఆకలి తీర్చాలని చూస్తున్నాడు. కె.జి.ఎఫ్, సలార్ సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ఏర్పాటు చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో తారక్ తో చేస్తున్న సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఎన్టీఆర్, నీల్ సినిమా గురించి ఇస్తున్న హైప్ ఐతే నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
త్రివిక్రమ్, ఎన్టీఆర్ మైథాలజీ మూవీ..
ఐతే ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ అసలైతే త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. హారిక హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఒక మైథాలజీ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. ఐతే ఎన్టీఆర్ తో సినిమా రేసులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 సినిమా చేస్తున్న నెల్సన్ నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమానే చేయబోతున్నాడు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. ఐతే త్రివిక్రమ్, నెల్సన్ ఇద్దరిలో ఎన్టీఆర్ ఎవరి సినిమా ముందు మొదలు పెడతాడన్నది సస్పెన్స్ గా ఉంది. జైలర్ 2 షూటింగ్ జరుపుకుంటుంది. ఆ సినిమా పూర్తి కాగానే తారక్ సినిమా పనులు స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నెల్సన్. ఐతే త్రివిక్రమ్ సినిమా మొదలు పెడితే ఒక రెండు మూడేళ్లు టైం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే నెల్సన్ సినిమా పూర్తి చేసి గురూజీ సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట.
నెల్సన్ తో సినిమాకు ఎన్టీఆర్..
నెల్సన్ సినిమా మొదలు పెట్టి దాన్ని చేస్తూ త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ చేయాలని తారక్ చూస్తున్నాడట. నీల్ సినిమా రిలీజ్ తర్వాత నెల్సన్, త్రివిక్రమ్ ఇద్దరికి తన డేట్స్ ఇస్తున్న ఎన్టీఆర్ రెండు సినిమాలను పార్లర్ షూట్ చేసేలా సర్ధుబాటు చేస్తున్నాడట. నెల్సన్ సినిమాకు ఏడాది టైం ఇచ్చి రిలీజ్ చేసేలా ప్లాన్ ఉండగా గురూజీ తో చేస్తున్న మైథాలజీ సినిమాకు కాస్త ఎక్కువ టైం ఇవ్వాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. మరి ఈ ఇద్దరి దర్శకుల్లో ఎన్టీఆర్ ముందెవరితో సినిమా షురూ చేస్తాడన్నది చూడాలి.
ప్రస్తుతం స్టార్ సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ లు అవుతున్నాయి. ఎన్ టీ ఆర్ కూడా నీల్ సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఆ సినిమా ఇచ్చిన పుష్ తోనే నెక్స్ట్ నెల్సన్, త్రివిక్రమ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు తారక్. సో తారక్ ఫ్యాన్స్ కి అయితే రాబోతున్న 3 సినిమాలు ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పొచ్చు.
