ఎన్టీఆర్ త్రివిక్రమ్.. నెక్స్ట్ ఇయర్ లోనే అంటున్నారే..!
ఎన్టీఆర్ అంటే ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే స్టార్ అని అంటుంటారు. ముఖ్యంగా ఈ తరం కథానాయకులలో పౌరాణిక పాత్రలు చేసి మెప్పించాలంటే మొదట తారక్ పేరే వినిపిస్తుంది.
By: Tupaki Desk | 27 Jun 2025 4:00 AMదేవర 1 తర్వాత ఎన్టీఆర్ వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా మీద తారక్ ఫ్యాన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా చేస్తున్నాడు ఎన్టీఆర్. నీల్ తో తారక్ చేస్తున్న సినిమా మాస్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని తెలుస్తుంది.
ఐతే ఈ ప్రాజెక్ట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా చేయనున్నారు. ఈమధ్యనే నిర్మాత నాగ వంశీ ఈ కథ సుబ్రహ్మణ్యస్వామి కథతో రాబోతుందని హింట్ ఇచ్చాడు. కుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ ఇలా ఏ పేరుతో పిలిచినా సరే ఆయన రూపం వస్తుంది. ఐతే ఈ కథను త్రివిక్రం ఎలా రాసుకున్నారు. స్కంద పురాణంలో ఏ అంశాలను తెరపై చూపించనున్నారు అన్నది ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
ఎన్టీఆర్ త్రివిక్రం సినిమా ఈ ఇయర్ మొదలవుతుంది అనుకోగా అది కాస్త నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈలోగా తారక్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మరోపక్క త్రివిక్రం కూడా విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. సో ఇద్దరు కూడా వారి వారి ప్రాజెక్ట్ లను పూర్తి చేశాకనే కలిసి ఆ భారీ సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ తో త్రివిక్రం చేస్తున్న ఈ మైథాలజీ కథ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.
ఎన్టీఆర్ అంటే ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే స్టార్ అని అంటుంటారు. ముఖ్యంగా ఈ తరం కథానాయకులలో పౌరాణిక పాత్రలు చేసి మెప్పించాలంటే మొదట తారక్ పేరే వినిపిస్తుంది. అలాంటిది ఆయనతో గురూజీ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ అయితే తెలుగు సినీ ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు. ఈ సినిమా కథ కూడా త్రివిక్రం ఎంతో కష్టపడి రెడీ చేసినట్టు తెలుస్తుంది. మరి గురూజీ అసలు సత్తా ఏంటన్నది ఈ సినిమాతో ప్రూవ్ అవుతుందేమో చూడాలి.