బన్నీ ప్రాజెక్ట్ తారక్ చేతికెళ్లిందా? నాగవంశీ ఏమన్నారంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మైథలాజికల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 July 2025 7:51 PM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మైథలాజికల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాలనుకున్నారని.. అదే ఇప్పుడు తారక్ చేతికెళ్లిందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకోవడం మాత్రం నిజమే. అప్పట్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ అదే సినిమాను ఇప్పుడు తారక్ తో చేస్తున్నారని ఇప్పటికీ ఎవరూ చెప్పలేదు. కానీ నెట్టింట అది నిజమేనని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు ఆ విషయంపై నిర్మాత నాగవంశీ రెస్పాండ్ అయ్యారు. త్రివిక్రమ్ తన లైనప్ ఆర్డర్ ను చేంజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, ముందుగా ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని డిసైడ్ అయ్యారని తెలిపారు. కానీ త్రివిక్రమ్ బన్నీ సినిమాను ఎన్టీఆర్ తో చేస్తున్నారా అనే విషయం మాత్రం తనకు తెలియదని అన్నారు.
"అది త్రివిక్రమ్ గారి నిర్ణయం. బహుశా ఆయన తన లైనప్ ఆర్డర్ ను మార్చాలని ఆలోచించి ఉండవచ్చు. అందుకే మా ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. దానితో మేము ఎవరినీ బాధ పెట్టలేదు. టైమ్ లైన్ మార్పు ప్రకారం మేం మార్చాం. తారక్ అన్నతో త్రివిక్రమ్ గారు చేస్తున్న సినిమా కార్తీకేయుని గురించని తెలుసు" అని నాగవంశీ తెలిపారు.
"కానీ బన్నీతో చేయాలనుకున్న సినిమా స్టోరీ గురించి నేనెప్పుడూ త్రివిక్రమ్ గారిని అడగలేదు. అందుకే అల్లు అర్జున్ గారి సినిమా తారక్ అన్న కు మారిందో లేదో తనకు తెలియదు. ఎన్టీఆర్ మూవీ కోసం త్రివిక్రమ్ గారు రాసుకున్న కథలోని కొన్ని ఎలిమెంట్స్ విన్నా. పక్కా పాన్ ఇండియాతోపాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవుతుంది" అని చెప్పారు.
అయితే తారక్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ను భారీ రేంజ్ ప్లాన్ చేశామని ఇటీవల నాగవంశీ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ ను రాముడు, కృష్ణుడిగా చూశామని, ఇప్పుడు తారక్ ను ఆ స్థాయిలో చూడబోతున్నారంటూ చెప్పి అంచనాలు పెంచారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, 2026 మధ్యలో ప్రాజెక్ట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.
