Begin typing your search above and press return to search.

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్, మైథలాజికల్ కథాంశం నేపథ్యంలో స్క్రిప్ట్‌పై మరింత కసరత్తు అవసరమని, సినిమా ప్రారంభం ఆలస్యం కావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత లేదు.

By:  Tupaki Desk   |   9 Nov 2026 4:00 PM IST
గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఎన్టీఆర్ `డ్రాగ‌న్` షూటింగ్ పూర్తి చేసిన అనంత‌రం `గాడ్ ఆఫ్ వార్` షూట్ లో నే పాల్గొంటారు? అన్న‌ది అధికారిక స‌మాచారం. అటు గురూజీ కూడా అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై కొత్త సందేహాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వివ‌రాల్లోకి ఇక వెళ్తే ఇటీవ‌లే త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన `ఆద‌ర్శ‌కుటుంబం` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇది రెగ్యుల‌ర్ స్టోరీ.

ఓ కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ అంచ‌నాలు మాత్రం అనుకున్న విధంగా అందుకోలేదు. అటు `గాడ్ ఆఫ్ వార్` అన్న‌ది భారీ పాన్ ఇండియా చిత్రం. త్రివిక్ర‌మ్ కి ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. దాదాపు500 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో రూపొందించాల్సిన క‌థ‌. ఇలాంటి క‌థ‌ను ఎన్టీఆర్ తో గురూజీ ఎలా డీల్ చేస్తారు? అన్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన సినిమాల శైలి వేరు. అత‌డు తీసిన‌ కుటుంబం క‌థ‌లు..స్టార్ ఇమేజ్..అత‌డి డైలాగ్ ప‌వ‌ర్ తో సినిమాలు ఆడాయి.

కానీ గాడ్ ఆఫ్ వార్ అన్న‌ది పాన్ ఇండియా సినిమా. పైగా మైథ‌లాజిక‌ల్ కాన్సెప్ట్. ఇలాంటి ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించిన అనుభ‌వం గురూజీకి లేదు. దీంతో పాటు బ‌డ్జెట్ కూడా వంద‌ల కోట్లు వెచ్చించాల్సి వ‌స్తుంది. అలాగే ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకుని తీయాల్సిన సినిమా. డ్రాగ‌న్ రిలీజ్ అనంత‌రం హిట్ అయితే తార‌క్ ఇమేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని గాడ్ ఆఫ్ వార్ ని గురూజీ డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో సినిమా ప్రారంభం కావ‌డానికి మరింత స‌మ‌యం ప‌డుతుంద‌నే కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తుంది.

స్క్రిప్ట్ విష‌యంలో తార‌క్ ఎంత మాత్రం రాజీ ప‌డ‌రు. `దేవ‌ర` విష‌యంలో కొర‌టాల‌తో తార‌క్ ఎలా ఫైట్ చేసారు? అన్న‌ది తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత తారక్ ను స్క్రిప్ట్ ప‌రంగా మెప్పించ‌డానికి కోర‌టాల చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ర‌క‌ర‌కాల వెర్ష‌న్లు..ఎన్నో మార్పులు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఆ క‌థ కోసం తార‌క్ ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేసారు. అయినా ఫ‌లితం తార‌క్ అనుకున్న విధంగా రాలేదు. ఆ కార‌ణంతోనే తాత్కాలికంగా `దేవ‌ర 2`ను ప‌క్క‌న పెట్టారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం. అలా చూస్తే? గాడ్ ఆఫ్ వార్ విష‌ యంలో తార‌క్ మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు? అన‌డంలో సందేహం లేదు. తాను అనుకున్న విధంగా ప‌క్కాగా ఉంటేనే మూవ్ అవుతారు. లేదంటే? ప‌క్క‌న పెట్ట‌డానికి కూడా వెన‌క‌డుగు వేయ‌రు.