Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాలో త్రివిక్రం ఛాయిస్ ఎవరు..?

మహేష్ తో గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాదు.

By:  Ramesh Boddu   |   29 July 2025 9:00 PM IST
ఎన్టీఆర్ సినిమాలో త్రివిక్రం ఛాయిస్ ఎవరు..?
X

మహేష్ తో గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాదు. ముందు హీరోగా అల్లు అర్జున్ అనుకోవడం ఆ తర్వాత ఆయన ప్లేస్ లో ఎన్టీఆర్ రావడం అంతా తెలిసిందే. అసలు అల్లు అర్జున్ బదులుగా ఎన్టీఆర్ ని ఎందుకు రీ ప్లేస్ చేశారా అన్నది మాత్రం తెలియలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా మురుగన్ కుమారస్వామి గురించి ఉంటుందని ఇప్పటికే నిర్మాత నాగ వంశీ హింట్ ఇచ్చాడు. ఆమధ్య ఎన్టీఆర్ మురుగన్ బుక్ తో కనిపించే సరికి ఈ మాటకు ఇంకాస్త బలం వచ్చింది.

డ్రాగన్ టైటిల్ తో ఎన్టీఆర్..

వార్ 2 రిలీజ్ బిజీలో ఉన్న ఎన్టీఆర్ ఓ పక్క ప్రశాంత్ నీల్ సినిమాను కూడా పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా ఎక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఎలాగైనా తీసుకు రావాలని గట్టి ప్లానింగ్ తో వెళ్తున్నారు. డ్రాగన్ టైటిల్ తో వస్తున్న ఆ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఈ ఇయర్ లోనే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

ఐతే ఎన్టీఆర్ గురూజీ మూవీలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆమధ్య ఎన్టీఆర్ చేతిలో ఉన్న పుస్తకమే మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్ దగ్గర ఉందని హడావిడి చేశారు. అసలు మడోన్నా ఆ బుక్ ఎందుకు చదువుతుందా అన్న అనుమానాలు వచ్చాయి. మడోన్న గురించి కన్ఫర్మేషన్ అయితే ఏది రాలేదు. మరో హీరోయిన్ ఎవరైనా ఉంటారా అన్న డిస్కషన్స్ కూడా ఏమి జరగట్లేదు.

ఎన్టీఆర్ మైథాలజీ సినిమా..

ఎన్టీఆర్ త్రివిక్రం అరవింద సమేత సినిమాకు కలిసి పనిచేశారు. ఎన్టీఆర్ తో ఊర మాస్ సినిమా చేసినా అందులో తన మార్క్ కనిపించేలా చేశాడు గురూజీ. అందుకే త్రివిక్రం డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా అది కూడా మైథాలజీ అనేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి ఎక్కువైంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తేనే కానీ అసలు విషయాలు అన్ని ఒక్కొక్కటిగా తెలుస్తాయి.

త్రివిక్రం మాత్రం ఈ సినిమాను తన కెరీర్ లో ఏ సినిమాకు చేయనంత గ్రాండ్ గా భారీగా ప్లాన్ చేస్తున్నారని అర్ధమవుతుంది. మరి గురూజీ ఇలా కమిటై చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది.. ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.