Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ చేతిలో ఆ పుస్తకం.. త్రివిక్రమ్ కథపై క్లారిటీ వచ్చినట్లే..

అయితే ఈసారి ఇది పూర్తిగా పౌరాణిక నేపథ్యంతో ఉండబోతున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన సంకేతాలు తాజాగా బయటకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   26 Jun 2025 1:51 PM IST
ఎన్టీఆర్ చేతిలో ఆ పుస్తకం.. త్రివిక్రమ్ కథపై క్లారిటీ వచ్చినట్లే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. కమర్షియల్ సినిమాలకు తోడు విభిన్న ప్రయోగాలు చేయడంలోను ముందుంటాడు. తాజాగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి కలవబోతున్న సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఈసారి ఇది పూర్తిగా పౌరాణిక నేపథ్యంతో ఉండబోతున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన సంకేతాలు తాజాగా బయటకి వచ్చాయి.


ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఆయన చేతిలో మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్ అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని ఆనంద్ బాలసుబ్రహ్మణియన్ రచించారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గురించి వివరించే పుస్తకం. పౌరాణిక గాధల నేపథ్యంలో మురుగన్ జీవితం, గుణగణాలు, యుద్ధ నైపుణ్యం, జ్ఞాన పరంపరలు వంటి అంశాలను ఈ పుస్తకం లో అందించారు.


త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ఇదే పుస్తకం ఆధారమై ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టును ఇప్పటికే ప్రకటించారు కానీ ఇంకా షూటింగ్ ప్రారంభ తేదీ ఖరారు కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’, డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన హోమ్‌వర్క్‌ను ఆయన ఇప్పటినుంచే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. అదే సందర్భంలో ఈ పుస్తకాన్ని చదువుతూ కనిపించడాన్ని సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా చూస్తోంది.


ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుందని సమాచారం. ఎన్టీఆర్ మొదటిసారి పౌరాణిక యోధుడిగా తెరపై కనిపించబోతున్నాడన్న వార్తలే అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. మురుగన్ పాత్రలో ఎన్టీఆర్ ఎలా కనబడతాడు, త్రివిక్రమ్ అతన్ని ఎలా డిజైన్ చేస్తాడన్న ఆసక్తికర చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఆయన వేషధారణ, మాటల తీరు, యాక్షన్ డిజైన్ ఇలా అన్ని విషయంలోనూ కొత్తదనం చూపిస్తారని ఊహించుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. స్క్రిప్ట్ పనులు పూర్తికాగానే అధికారికంగా టైటిల్, క్యాస్ట్, టెక్నికల్ టీం వివరాలను వెల్లడించనున్నారు. త్రివిక్రమ్ మాస్‌కు మళ్లీ పౌరాణిక నేపథ్యంలో తన మార్క్ కథనంతో హిట్ కొడతాడా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను దేవత పాత్రతో మిళితం చేసి మరోసారి మ్యాజిక్ చేస్తాడా అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభించనుంది.