Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మైక్ పట్టుకుంటే అంతే మరి..

ఐతే నిన్న ‘మ్యాడ్’ సక్సెస్ మీట్‌‌కు తారక్ రావడంతో అది అభిమానులతో గెట్ టు గెదర్ లాగా మారిపోయింది. వారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా తారక్ చేసిన ప్రసంగం కట్టిపడేసింది.

By:  Tupaki Desk   |   5 April 2025 6:55 PM IST
Ntr Speech At Mad Square Meet
X

టాలీవుడ్ స్టార్ హీరోల్లో బెస్ట్ స్పీకర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేయొచ్చేమో. టీనేజీలోనే స్టేజ్ మీద అద్భుతమైన ప్రసంగాలతో అదరగొట్టిన తారక్.. వయసు పెరిగేకొద్దీ పరిణతి సాధించాడు. ప్రతి మాటా కొలిచినట్లు మాట్లాడుతూ.. తన అభిమానులనే కాక అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. స్టేజ్ మీద అతను మాట్లాడుతుంటే.. ఎంతసేపైనా కళ్లు, చెవులు అప్పగించేస్తారు ప్రేక్షకులు. ఓవైపు అభిమానులను ఉర్రూతలూగిస్తూనే.. ఆలోచింపజేసేలా మాట్లాడ్డం తారక్‌కే చెల్లు. ఐతే రకరకాల కారణాల వల్ల తారక్ తన అభిమానులతో ఎంగేజ్ అయి చాలా కాలం అయింది. ‘దేవర’ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ అనుకున్నారు కానీ.. రెండూ సాధ్యపడలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు చేశాక వేదిక దగ్గర అభిమాన సందోహం ఎక్కువైపోయి ఈవెంటే క్యాన్సిల్ చేసేశారు. సక్సెస్ మీట్ సైతం నిర్వహించలేకపోయారు.

ఐతే నిన్న ‘మ్యాడ్’ సక్సెస్ మీట్‌‌కు తారక్ రావడంతో అది అభిమానులతో గెట్ టు గెదర్ లాగా మారిపోయింది. వారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా తారక్ చేసిన ప్రసంగం కట్టిపడేసింది. ‘దేవర-2 ఉండి తీరుతుంది అని నొక్కి వక్కాణించడం ద్వారా.. ఈ సినిమా మీద ఉన్న సందేహాలకు తెరదించాడు తారక్. అలాగే ‘అదుర్స్-2’ గురించి ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ప్రచారానికి ఈ ఈవెంట్ నుంచే తెరదించేశాడు తారక్. తనకు పెద్ద ఫ్యాన్ అయిన నిర్మాత నాగవంశీతో ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ఉండబోతోందంటూ తారక్ చేసిన ప్రకటన అభిమానులను ఎంతగానో ఎగ్జైట్ చేసింది. సోషల్ మీడియా జనాలు నాగవంశీని మీమర్స్ పిలిచే ‘చింటు’ అనే మాటను తాను కూడా వాడడం ఈ స్పీచ్‌లో పెద్ద హైలైట్. దీన్ని బట్టి తారక్ సోషల్ మీడియాను, మీమ్స్‌ను ఎంతగా ఫాలో అవుతాడో, ఎంత అప్‌డేటెడ్‌గా ఉంటాడో చెప్పడానికి ఉదాహరణ. ఇక తన బావమరిది నార్నె నితిన్‌ను ఎందుకు సరిగా ప్రమోట్ చేయడనే విషయంలోనూ తారక్ క్లారిటీ ఇచ్చాడు. నితిన్ తాను నటుడు అవుతానని చెప్పినపుడు.. ‘‘నా సపోర్ట్ ఉండదు పోయి చావు’’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని భలే సరదాగా చెప్పి ఆడిటోరియాన్ని హోరెత్తించాడు తారక్. మరోవైపు తన సిగ్నేచర్ కాలర్ మూమెంట్‌ను రీక్రియేట్ చేస్తూ.. అభిమానులు గర్వపడేలా తన ప్రయత్నం చేస్తూనే ఉంటా అని తారక్ ఇచ్చిన భరోసా ఇంకో హైలైట్. ఇలా మొత్తంగా నిన్నటి తారక్ స్పీచ్ ఆద్యంతం ఉర్రూతలూగించేలా సాగుతూ అభిమానులకు ఒక మధుర జ్ఞాపకంగా మారిపోయింది.