ఎన్టీఆర్ సేఫ్.. హృతిక్ దొరికేశాడా?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్-2 మూవీ రూపొందిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 Aug 2025 11:40 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్-2 మూవీ రూపొందిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. అనిల్ కపూర్, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
యష్ రాజ్ ఫిల్మ్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఆ సినిమాను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్-2 స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ.. వాటిని మాత్రం అందుకోలేదని చెప్పాలి.
వార్ మూవీ అప్పట్లో రూ.400 కోట్లు పైగా వసూలు చేసి.. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్శ్ లో అప్పట్లో అదే పెద్ద హిట్ గా నిలిచింది. కానీ ఇప్పుడు వార్-2 మాత్రం మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఆ తర్వాత రెండు రోజుల సెలవుల వల్ల సాలిడ్ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు వీక్ డేస్ మొదలయ్యాక.. వసూళ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. భారీగా తగ్గాయని టాక్ వినిపిస్తోంది. దీంతో మేకర్స్ కు నష్టాలు తప్పవని అనేక మంది సినీ ప్రియులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతున్నారు.
వార్-2కు గాను ఎన్టీఆర్.. రూ.60 కోట్ల వరకు అందుకున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ హృతిక్ రోషన్ సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకునేలా మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇప్పుడు లాభాలు రావడం అనుమానమే. దీంతో పారితోషికం విషయంలో ఎన్టీఆర్ సేఫ్ అనే చెప్పాలి.
బాలీవుడ్ డెబ్యూతో అనుకున్నంత రేంజ్ లో హిట్ సాధించకపోయినా.. రెమ్యునరేషన్ మ్యాటర్ లో సేఫ్ గా ఉన్నారు. హృతిక్ రోషన్ మాత్రం బుక్ అయ్యారని చెప్పాలి. అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ చిత్రాన్ని సొంతంగా విడుదల చేసి, నాన్ థియేట్రికల్ డీల్స్ నుంచి మంచి రికవరీని పొందింది. కానీ లాభాలు వస్తాయని మాత్రం చెప్పలేం. కాబట్టి హృతిక్ రోషన్ పారితోషికం విషయంలో దొరికేశారు!
