Begin typing your search above and press return to search.

వార్ 2.. ఎన్టీఆర్ కోసమే ఆ మార్పులా..?

స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన వార్ 2లో ఎన్టీఆర్ రోల్ ని కొనసాగించడం చూస్తే నెక్స్ట్ రాబోయే సినిమాల్లో కూడా తారక్ ఈ యూనివర్స్ లో ఉండే ఛాన్స్ ఉందా అనే డౌట్ రేజ్ అవుతుంది.

By:  Ramesh Boddu   |   16 Aug 2025 10:32 AM IST
వార్ 2.. ఎన్టీఆర్ కోసమే ఆ మార్పులా..?
X

యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 వచ్చింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఐతే ఈ సినిమా కథ అనుకున్నప్పుడు ఎన్ టీ ఆర్ రోల్ చివరకు చనిపోవాల్సి ఉందట. కానీ తన రోల్ అలా ముగిస్తే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టమని ఎన్ టీ ఆర్ చెప్పడంతో అయాన్ ముఖర్జీ అండ్ టీం క్లైమాక్స్ లో మార్చాల్సి వచ్చిందట. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కూడా వార్ 2 కి ది బెస్ట్ ఇచ్చారు.

స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్..

ఐతే ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్. యష్ రాజ్ లాంటి సంస్థ నుంచి వాళ్లు చేసే స్పై యూనివర్స్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే వచ్చిన ఈ ఛాన్స్ ని ఎందుకు వదులుకోవడం అనుకుని చేసి ఉండొచ్చు. ఐతే సినిమాలో గ్రాఫిక్స్ అదే ఫ్యాన్స్ కి ఎక్కువ మజా ఇద్దామనుకుని పెట్టిన సీన్స్ కాస్త మిస్ ఫైర్ అవుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ ఎనర్జీని సరిగా వాడుకోలేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది.

స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన వార్ 2లో ఎన్టీఆర్ రోల్ ని కొనసాగించడం చూస్తే నెక్స్ట్ రాబోయే సినిమాల్లో కూడా తారక్ ఈ యూనివర్స్ లో ఉండే ఛాన్స్ ఉందా అనే డౌట్ రేజ్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వార్ 2 చేసినందుకు హ్యాపీనే కానీ ఈ రిస్క్ కూడా ఎందుకు అని భావిస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగు సినిమాలతోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసే సత్తా ఉందని అంటున్నారు. అఫ్కోర్స్ ఎన్టీఆర్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వార్ 2 తెలుగు బజ్..

బాలీవుడ్ మొదటి సినిమా ప్రత్యేకంగా ఉండాలని అనుకున్న ఫ్యాన్స్ కి కాస్త నిరుత్సాహం తప్పలేదు. అయినా సరే వార్ 2 తెలుగులో ఈ రేంజ్ బజ్ ఏర్పరచుకుంది అంటే అది కచ్చితంగా ఎన్టీఆర్ వల్లే. వార్ 2 ఎన్టీఆర్ రోల్ వేరే వాళ్లు చేస్తే మాత్రం ఈ రేంజ్ డిస్కషన్ ఇంకా హంగామా ఉండేది కాదు. ఐతే ఎన్టీఆర్ చేసినా కూడా వార్ 2 బాక్సాఫీస్ లెక్కలు ఆశించిన స్థాయిలో లేవు. దానికి కచ్చితంగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వైపే వేళ్లన్ని చూపిస్తాయి.

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ వస్తుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా లైన్ లో ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.