Begin typing your search above and press return to search.

చరణ్ - తారక్.. లాంగ్ గ్యాప్ తరువాత స్టైలిష్ సర్ ప్రైజ్!

ఇక ఆ సినిమా సక్సెస్ హడావుడి అనంతరం మళ్ళీ పర్సనల్ విజిట్స్ జరిగినా కూడా ఎక్కడ ఈవెంట్ లో అయితే కలిసి కనిపించ లేదు.

By:  Tupaki Desk   |   12 May 2025 7:26 AM
చరణ్ - తారక్.. లాంగ్ గ్యాప్ తరువాత స్టైలిష్ సర్ ప్రైజ్!
X

ఆర్ఆర్ఆర్ మూవీతో దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ మంచి క్రేజ్ అందుకున్నారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఇక ఆ సినిమా సక్సెస్ హడావుడి అనంతరం మళ్ళీ పర్సనల్ విజిట్స్ జరిగినా కూడా ఎక్కడ ఈవెంట్ లో అయితే కలిసి కనిపించ లేదు. ఇక ఇన్నాళ్ళకు మళ్ళీ అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో ఈ కలయిక ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. లేటెస్ట్ గా లండన్ వేదికగా మళ్లీ కలసి కనిపించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR పాన్ వరల్డ్ బ్లాక్‌బస్టర్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే.


నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘RRR లైవ్ ఇన్ కన్‌సర్ట్’ పేరుతో ఘనమైన సంగీత వేదిక ఏర్పాటైంది. ఈ ఈవెంట్‌కు ఎమ్.ఎమ్. కీరవాణి తన లైవ్ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించగా.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర కీలక సభ్యులు పాల్గొన్నారు.


చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ - చరణ్ కలిసిన సందర్భం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ లైవ్ కన్‌సర్ట్‌లో ఎన్టీఆర్ ముందుగానే రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం హైలైట్‌గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ స్టైలిష్ అవతారంలో మెరిసారు. ఒకవైపు ఎన్టీఆర్ బ్లాక్ సూట్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచినట్టు కనిపించగా, మరోవైపు రామ్ చరణ్ బేజి టోన్ సూట్‌లో క్లాస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు.


ఈ స్టైలిష్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరి కలయికను చూడటం అభిమానులకు పండగే అని కామెంట్లు చేస్తున్నారు. ఇదే ఈవెంట్‌లో మహేశ్ బాబు కూడా దర్శనమిచ్చినట్లు సమాచారం. రాజమౌళి తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆస్కార్ వంటి అంతర్జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓ చరిత్రగా నిలిచిపోయింది.

తాజాగా RRR లైవ్ కాన్సర్ట్ ద్వారా ఈ సినిమా మరోసారి హైలైట్ అయింది. రాయల్ ఫిలహార్మనిక్ ఆర్కెస్ట్రాతో కీరవాణి చేసిన సంగీత ప్రదర్శనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వేడుకను అత్యంత ప్రత్యేకంగా మార్చింది ఎన్టీఆర్, చరణ్‌ల కలయికే. వీరి స్నేహం, ఆర్ఆర్ఆర్ తరువాత కూడా కొనసాగుతోందని వీరి అట్టహాసం స్పష్టంగా చెబుతోంది. అభిమానులు మాత్రం వీరి కలయికలో మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.