Begin typing your search above and press return to search.

NTR Neel మూవీ ఆన్‌ లొకేషన్‌ పిక్‌ షేర్ చేసిన లికిత

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   5 May 2025 1:12 PM
NTR Neel మూవీ ఆన్‌ లొకేషన్‌ పిక్‌ షేర్ చేసిన లికిత
X

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. సినిమా నుంచి ప్రత్యేక అప్డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కర్ణాటకలో జరుగుతోంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబో మూవీ పై పాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్‌ నీల్‌ భారీగా ఖర్చు చేస్తూ సినిమాను రూపొందిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాలను మించి ఎన్టీఆర్‌తో యాక్షన్‌ సన్నివేశాలను డ్రాగన్‌ సినిమాలో చేయించేందుకు రెడీ అవుతున్నాడని కూడా సమాచారం అందుతోంది.

ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమా కోసం తన గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మాసివ్ సెట్స్‌ను వేయిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న సెట్‌ ను కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు. బాబోయ్‌ ఇదేం సెట్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి, ఈ సినిమా కోసం వేసిన సెట్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే ప్రియులకు కచ్చితంగా డ్రాగన్‌ సినిమా విందు భోజనం అన్నట్లుగా ఉంటుంది అంటూ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ నమ్మకంగా చెబుతున్నారు. ఆకట్టుకునే కథ, కథనంతో ఈ సినిమా రూపొందబోతుంది.

తాజాగా డ్రాగన్ సెట్స్‌కి అనుకోని అతిథి వచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ భార్య లికిత రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డ్రాగన్‌ సెట్‌లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన షూటింగ్‌ చేస్తున్నది ఎన్టీఆర్‌ తోనే అనే విషయం తెలసిందే. కనుక లికిత రెడ్డి ఫోటో షేర్‌ చేసిన వెంటనే అంతా కూడా ఈ సినిమా గురించే అనుకుంటున్నారు. మ్యాడ్‌ పర్సన్‌తో మ్యాడ్‌ సెట్‌లో అంటూ అంచనాలు పెంచే విధంగా కామెంట్‌ పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉండటంతో భర్త వద్దకు వచ్చి లికిత రెడ్డి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. సెలబ్రేషన్‌ టైమ్‌ అంటూ లికిత ఫోటోపై కామెంట్‌ పెట్టింది.

సినిమా సెట్‌లో సెలబ్రేషన్‌ అంటూ లికిత రెడ్డి షేర్‌ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ తల వెనుక చేయి పెట్టి, అతడి భుజం పై చేయి తల పెట్టి ఉన్న సమయంలో వెనక నుంచి ఈ ఫోటోను తీశారు. ఇందులో ఇద్దరి ఫేస్‌లు కనిపించకున్నా కూడా తెగ వైరల్‌ అవుతోంది. ఇదే జోష్‌లో ఎన్టీఆర్‌తో ఫోటో దిగే ఉంటారు, ఆ ఫోటోను కూడా షేర్‌ చేయండి మేడం అంటూ లికిత రెడ్డిని పలువురు సోషల్‌ మీడియా ద్వారా రిక్వెస్ట్‌ చేస్తున్నారు. డ్రాగన్‌ సెట్‌లో ఎన్టీఆర్‌ ఎలా ఉంటాడు అనేది ఇప్పటి వరకు రివీల్‌ చేయలేదు. ఈనెల ఎన్టీఆర్‌ బర్త్‌డే ఉంది. ఆ రోజు ఎన్టీఆర్‌ లుక్‌ను రివీల్‌ చేసే విధంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది.