ఎన్టీఆర్ 'డ్రాగన్' ప్లాన్ ఎందుకు మారింది?
పాన్ ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించిన మూవీస్ `కేజీఎఫ్, కేజీఎఫ్ 2. ఈ సినిమాలతో దర్శకుడిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.
By: Ravindar Gorantla | 21 Feb 2026 5:11 PM ISTపాన్ ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించిన మూవీస్ `కేజీఎఫ్, కేజీఎఫ్ 2. ఈ సినిమాలతో దర్శకుడిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో `సలార్` వంటి యాక్షన్ డ్రామాని రూపొందించిన ఈ దర్శకుడు ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో ఓ భారీ పీరియాడిక్ హైవోల్టేజ్ హార్ట్ కోర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, టొవినో థామస్ నటిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రముఖ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం భారీ స్థాయిలో తగ్గిన ఎన్టీఆర్ లాంగ్ బియార్డ్‌తో, స్లిమ్ లుక్‌లో రాజసంగా కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తన గత చిత్రాల తరహాలోనే ఈ మూవీని కూడా ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ నేపథ్యంలో ఓ ఫాంటసీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ ప్రారంభించారు. ఇటీవలే టీమ్ హైవోల్టేజ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఎన్టీఆర్‌తో పాటు టీమ్ అంతా కలిసి జోర్డాన్ వెళ్లింది. అక్కడే కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇవి సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్. ఈ షెడ్యూల్‌ని మార్చి ఫస్ట్ వీక్ వరకు ప్లాన్ చేశారు. అయితే సడన్‌గా ప్లాన్ మారినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందు అనుకున్న ప్రకారం మార్చి ఫస్ట్ వీక్ వరకు టీమ్ జోర్డాన్‌లో షూటింగ్ చేయడం లేదని ఇన్ సైడ్ టాక్.
సడన్‌గా ప్లాన్ మారడానికి బలమైన కారణం ఉందని తెలిసింది. ముందుగా అక్కడ ప్లాన్ చేసిన యాక్షన్ సీన్స్ అన్నింటినీ టీమ్ పూర్తి చేసిందట. అయితే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో లాజిస్టిక్ ఇష్యూస్ కారణంగా యాక్షన్ సీక్వెన్సెస్‌లలో కొన్ని లింక్ సీన్స్‌ని హైదరాబాద్‌లో తీయాలని ప్లాన్ చేశారట. ఆ కారణంగానే జోర్డాన్‌లో ప్లాన్ చేసుకున్న కొన్ని సీన్స్‌ని ఇక్కడికి మార్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే టీమ్ అంతా ఫిబ్రవరి 25 వరకు జోర్డాన్ నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు.
`దేవర` తరువాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానులు దీనిపై బారీ అంచనాలు పెట్టుకున్నారు. `దేవర` ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో `డ్రాగన్`తో ఎన్టీఆర్ మళ్లీ ఫామ్‌లోకి రావాలని ప్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మేలో ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ఆ టైమ్‌లో ఈ మూవీ నుంచి అప్ డేట్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమానిజూన్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
