డ్రాగన్ వేట మొదలైంది
యంగ్ టైగర్‌ను మళ్లీ వేటపైకి తీసుకురావడానికి మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ మహా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు.
By: Tupaki Desk | 22 April 2025 9:21 AMయంగ్ టైగర్‌ను మళ్లీ వేటపైకి తీసుకురావడానికి మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ మహా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. మైత్రితో ఎన్టీఆర్ ఆర్స్ట్ కలిసి రూపొందిస్తున్న చిత్రం ‘డ్రాగన్’ మొదటి నుంచీ భారీ అంచనాల నడుమ సాగుతోంది. ఆర్ఆర్ఆర్ దేవర తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందో అనే కుతూహలానికి నెమ్మదిగా సమాధానాలు దొరికే సమయం ఆసన్నమైందని చెప్పాలి. డైరెక్టర్ నీల్ స్పష్టమైన యాక్షన్ రూట్‌తో దూసుకెళ్లేలా కథను మలచాడని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గట్టిగానే డిజైన్ చేసి ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే కెజిఎఫ్, సలార్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ఎంత బలంగా క్లిక్కయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ‘డ్రాగన్’ కోసం ప్రశాంత్ నీల్ ఏమేరకు దూకుడుగా ఆలోచిస్తాడో ఊహించగలరు. ఇదో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని, ఇందులో ఎన్టీఆర్ పాత్రకు చాలా వేరియేషన్స్ ఉన్నాయని అంతర్గత సమాచారం.
ఇప్పటికే మంగళూరు పోర్ట్ సెట్‌లో వేసిన భారీ షెడ్యూల్‌కి సంబంధించిన లోపల కథనం ప్రకారం… ఓ పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరణ మొదలైంది. సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా… తాజా అప్డేట్ మరింత జోష్ నింపుతోంది. తాజాగా విడుదలైన ఫోటోలో సెట్లో కెమెరాలు, లైటింగ్ సెటప్ మధ్య ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడైంది. ఇందులో “ది హంట్ బిగిన్స్” అనే క్యాప్షన్ తో పోస్టు చేయడం సినిమాకు సరిగ్గా సరిపోయేలా ఉంది.
ఇదివరకే వచ్చిన అప్డేట్స్ తో సినిమా ఎంత మాస్‌గా, ఎంత టెక్నికల్‌గా రూపొందుతోందో అర్థమవుతుంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ వాడకంతో రెగ్యులర్ సన్నివేశాలకు కూడా కొత్త లుక్ ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణ ప్రారంభమైనట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ ఎలా ఉంటుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సమ్మర్‌లో భారీగా విడుదల చేయాలనే ప్లాన్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ట్రెండింగ్‌లో ఉన్న ‘డ్రాగన్’ సినిమా… షూటింగ్ మొదలైన తర్వాత మళ్లీ టాప్ బజ్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ రాబోయే దూకుడును ‘డ్రాగన్’ ఏ రేంజ్‌లో చూపించబోతుందో… వేచి చూడాలి.