రుక్మిణికి మరో ఆఫర్.. ఇదంతా కుదిరే పనేనా?
ఆల్రెడీ త్రివిక్రమ్ రుక్మిణి కి కథను కూడా నెరేట్ చేశాడని అంటున్నారు. దీంతో పాటూ మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
By: Tupaki Desk | 23 May 2025 11:17 AM ISTసౌత్ ఇండియన్ సినిమాల్లో అందరూ ఆసక్తిగా చూస్తున్న సినిమా ఎన్టీఆర్‌నీల్ మూవీ కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నసినిమా కాబట్టి ఈ సినిమా షూటింగ్ టైమ్ లో వేరే సినిమాలకు సైన్ చేయడానికి రుక్మిణికి పర్మిషన్ లేదు.
ఒకే సారి రెండు మూడు ప్రాజెక్టులు ఒప్పుకుంటే షూటింగ్ టైమ్ లో కాల్షీట్స్ ఇబ్బందవుతాయని మేకర్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రుక్మిణి వసంత్ కు పలు డైరెక్టర్ల నుంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేయబోయే సినిమా కోసం రుక్మిణి పేరును పరిశీలిస్తున్నారట.
ఆల్రెడీ త్రివిక్రమ్ రుక్మిణి కి కథను కూడా నెరేట్ చేశాడని అంటున్నారు. దీంతో పాటూ మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న స్పిరిట్ సినిమాలో కూడా రుక్మిణి నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండూ కాకుండా థగ్ లైఫ్ తర్వాత మణిరత్నం చేయనున్న ఓ లవ్ స్టోరీలో కూడా రుక్మిణి వసంత్ నటిస్తుందని వార్తలొచ్చాయి.
ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌నీల్ సినిమాతో స్పెషల్ డీల్ కుదుర్చుకున్న రుక్మిణి వసంత్ ఈ ప్రాజెక్టులను ఒప్పుకుంటుందా అనేది ప్రశ్నగా మారింది. రుక్మిణిని వేరే ప్రాజెక్టులు చేసుకోవడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పర్మిషన్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్‌నీల్ సినిమా ప్రొడక్షన్ లోనే ఉంది. ఇంకా హీరోయిన్ గా రుక్మిణి సెట్స్ లోకి ఎంటరైంది లేదు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
