గాల్లో ఫైట్.. నేలపై రికార్డ్స్! డ్రాగన్ కోసం నీల్ భారీ ప్లాన్!
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రాజెక్ట్ పై వస్తున్న తాజా అప్‌డేట్లు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 30 March 2026 2:26 PM ISTటాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రాజెక్ట్ పై వస్తున్న తాజా అప్‌డేట్లు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ లో ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎగురుతున్న ఫ్లైట్‌లో తెరకెక్కించనున్న ఈ ఫైట్ ఎపిసోడ్, హాలీవుడ్ రేంజ్‌లో గ్రాండ్ విజువల్స్‌తో ఉండబోతుందని సమాచారం. కేవలం యాక్షన్ ఎపిసోడ్‌గా కాకుండా, కథలో కీలకమైన మలుపుకు దారి తీసే సన్నివేశంగా దీనిని డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో స్క్రీన్‌ప్లే ట్రీట్‌మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్. ఈసారి కూడా ఇంటర్వెల్ బ్లాక్‌ను కేవలం యాక్షన్‌తో కాకుండా, ఒక బలమైన ట్విస్ట్‌తో ముడిపెట్టి ప్రేక్షకులను షాక్‌కు గురి చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో తన కథన శైలిని కొత్త స్థాయికి తీసుకెళ్లిన నీల్, డ్రాగన్ లో మరింత ఎమోషనల్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మేళవించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమా మూడ్ ను మారుస్తున్న నీల్
ఇక విజువల్ స్టైల్ విషయంలో కూడా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సినిమాలు బ్లాక్ మరియు గ్రే టోన్‌లతో గంభీరమైన మూడ్‌ను సృష్టించాయి. అయితే ఈసారి మాత్రం ఆయన పూర్తి భిన్నంగా, కలర్‌ఫుల్ విజువల్ ప్యాలెట్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇది ఆయన ఫిల్మ్‌మేకింగ్‌లో ఒక కీలక మార్పుగా భావించవచ్చు. ఈ మార్పు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ మార్కెట్లలో కూడా గట్టి ప్రభావం చూపాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. కాస్టింగ్ విషయంలో కూడా ఈ సినిమా మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనీల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొత్తానికి, యాక్షన్, స్క్రీన్‌ప్లే, విజువల్ స్టైల్ ఛేంజెస్, భారీ నిర్మాణ విలువలు.. అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
