ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ అప్డేట్
ఎన్టీఆర్‌నీల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తైందని త్వరలోనే తర్వాతి షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం.
By: Tupaki Desk | 8 May 2025 11:33 AMప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఓ పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నీల్ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా, గత నెల 22 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. #ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ఓ కీలక షెడ్యూల్ ను ప్రశాంత్ నీల్ షూట్ చేశాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్‌నీల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తైందని త్వరలోనే తర్వాతి షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. ఎన్టీఆర్ బర్త్ డే తర్వాత నెక్ట్స్ షెడ్యూల్ ఉండే అవకాశముంది. బర్త్ డే వరకు బ్రేక్ తీసుకుని మళ్లీ సెట్స్ లో జాయిన్ అవాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. అయితే మే 15న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కెరీర్లో మునుపెన్నడూ లేనంత సన్నగా, స్టైలిష్ గా తయారయ్యాడు. లుక్ విషయంలోనే కాదు ఈ మూవీలో ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ అవతార్‌లో నీల్ ప్రెజెంట్ చేయనున్నాడట. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్‌కే టికెట్ డబ్బులు వసూలవుతాయంటున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు. దీంతో పాటూ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం వార్2 సినిమా కూడా ఉంది. డ్రాగన్ నెక్ట్స్ షెడ్యూల్ మొదలుపెట్టే లోపు తారక్ వార్2 డబ్బింగ్ పూర్తి చేసే ఛాన్సుంది.