నవంబర్ నాటికి నీల్ ముగిస్తాడా?
వార్2 సినిమాను చేస్తూనే ఎన్టీఆర్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 8 Aug 2025 8:00 PM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఎన్టీఆర్, వాటిని పూర్తి చేయాలంటే ఎంత లేదన్నా మరో ఏడాదిన్నర పడుతుంది. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ వార్2 సినిమా చేసిన విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.
వార్2 సినిమాను చేస్తూనే ఎన్టీఆర్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అటు ప్రశాంత్ నీల్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరికీ మాస్‌లో ఫాలోయింగ్ భారీగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నీల్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
వార్2 ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీ
డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పోర్షన్ కు సంబంధించిన 30 రోజుల షూటింగ్ పూర్తవగా, అందులో ఇంట్రడక్షన్ మరియు క్లైమాక్స్ ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వార్2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆగస్ట్ 20 తర్వాత నుంచి మళ్లీ ఈ సినిమాకు తన కాల్షీట్స్ ను ఇవ్వనున్నారట. సినిమా మొత్తాన్ని నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఎన్టీఆర్, తారక్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత కొరటాల శివతో కలిసి దేవర2 ను పూర్తి త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట ఎన్టీఆర్.
డ్రాగన్ కోసం ఎన్టీఆర్ స్టైలిష్ మేకోవర్
కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన కెరీర్లోనే ఎప్పుడూ లేనంత సన్నగా మారడంతో పాటూ ఎంతో స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు. డ్రాగన్ లో ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ లుక్ లో ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేయనున్నారని, లుక్ తో పాటూ ఎన్టీఆర్ పాత్ర కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
