Begin typing your search above and press return to search.

'డ్రాగన్‌' సెట్‌లో హెలికాప్టర్‌ నుంచి వార్ ట్యాంకర్లు...!

డ్రాగన్‌ సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన తర్వాత సలార్‌ 2 సినిమా బ్యాలన్స్ వర్క్ పూర్తి చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 April 2025 5:46 AM
డ్రాగన్‌ సెట్‌లో హెలికాప్టర్‌ నుంచి వార్ ట్యాంకర్లు...!
X

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబోలో రూపొందుతున్న 'డ్రాగన్‌' పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. కర్ణాటకలోని కుంటా సమీపంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలోని మెజార్టీ సన్నివేశాలను అక్కడ షూట్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సెట్‌ను భారీ ఎత్తున వేశారు. కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసి కుంటా సమీపంలో భారీ సెట్టింగ్‌ వేశారు. ఆ సెట్స్‌లో ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆ సెట్‌ను చూసి ఎన్టీఆర్‌ సర్‌ప్రైజ్ అయ్యాడని కన్నడ సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన కేజీఎఫ్‌, సలార్ సినిమాల్లో సరికొత్త ప్రపంచాన్ని చూపించిన విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ లో బంగారు గనులను చూపించిన ప్రశాంత్ నీల్‌, సలార్‌లో ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రాంతం కూడా ఉంటుందా అనిపించే విధంగా అద్భుతమైన ఖాన్సార్‌ ను క్రియేట్‌ చేశాడు. ప్రతి సన్నివేశంను చాలా రిచ్‌గా చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ప్రస్తుతం చేస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్‌ సినిమాలోనూ అదే రేంజ్‌లో సెట్స్‌ను చూపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుగుతున్న సెట్‌ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ సెట్‌ గురించి కన్నడ మీడియాతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

కూంటా సమీపంలోని విశాలమైన మైదానంలో భారీ సెట్స్‌ను నిర్మించారు. అందులోనే రైల్వే స్టేషన్ సెట్‌, హెలికాప్టర్‌, హెలీ ప్యాడ్‌, అప్పటి ఇళ్లు, భారీ తుపాకులు, వార్ ట్యాంకర్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే సరికొత్త ప్రపంచాన్ని అక్కడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఆవిష్కరించాడని, సినిమాలో ఆ సెట్‌ను చూస్తే ప్రేక్షకులు కచ్చితంగా సర్‌ప్రైజ్‌ అవుతారని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సలార్‌ సినిమా సూపర్‌ హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాలు రెండు పార్ట్‌లుగా చేసిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాను రెండు పార్ట్‌లుగా తీసుకు వస్తాడా లేదంటే ఒక్క పార్ట్‌తోనే ముగిస్తాడా అనేది చూడాలి.

డ్రాగన్‌ సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన తర్వాత సలార్‌ 2 సినిమా బ్యాలన్స్ వర్క్ పూర్తి చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. డ్రాగన్ సినిమాను మొదట 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం కావడంతో 2026 సమ్మర్‌కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి కచ్చితంగా అదిరి పోయే చిత్రాన్ని డ్రాగన్‌తో ప్రశాంత్‌ నీల్ ఇవ్వడం ఖాయం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా రూపొందబోతుంది. వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌తో ఈ సినిమా రాబోతుంది. మరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అనేది చూడాలి.