Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం పెద్ద స్కెచ్ వేసిన ప్రశాంత్ నీల్..!

ఈ అటెంప్ట్ క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతకీ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునె ఆ స్టార్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.

By:  Ramesh Boddu   |   25 Aug 2025 11:19 AM IST
ఎన్టీఆర్ కోసం పెద్ద స్కెచ్ వేసిన ప్రశాంత్ నీల్..!
X

వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. డ్రాగన్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ అసలు సిసలు మాస్ ఏంటో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఐతే ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్ వేశాడని తెలుస్తుంది.

డ్రాగన్ బైలింగ్వల్ మూవీ..

వార్ 2 తో ఎన్టీఆర్ హిందీ ఆడియన్స్ ని అలరించాడు. సో అక్కడ కూడా తన మార్కెట్ పెరిగినట్టే. అందుకే డ్రాగన్ ని డైరెక్ట్ హిందీ సినిమాలా తీసే ప్లాన్ లో ఉన్నారట. డ్రాగన్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఆ రోల్ కి హిందీలో ఒక స్టార్ ని సెలెక్ట్ చేస్తున్నారట. ఐతే హిందీలో ఆ స్టార్ చేసే రోల్ ని సౌత్ వరకు మరో తమిళ స్టార్ ని తీసుకుంటున్నారట. అంటే బైలింగ్వల్ మూవీ లాగా ఒకే కథ ఒకే స్క్రీన్ ప్లే.. కానీ హిందీలో ఒకరు చేసే రోల్ ని సౌత్ లో మరో స్టార్ చేస్తారట.

ఈ అటెంప్ట్ క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతకీ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునె ఆ స్టార్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఒకే సినిమాలో డబుల్ ధమాకా అన్నట్టుగా ఎన్టీఆర్ కోసం హిందీలో ఒకరు, తమిళ్ స్టార్ ఒకరు పనిచేయబోతున్నారు. ఈ స్కెచ్ చూస్తుంటేనే ప్రశాంత్ నీల్ ఈ మూవీని ఎలా ప్లాన్ చేస్తున్నారో అర్ధమవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది. సౌత్ లో ఆమె ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతుంది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో..

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఐతే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా దానికి మించి సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

దేవర 1, వార్ 2 ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే డ్రాగన్ మీదే వాళ్ల ఆశలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు ఒక రేంజ్ లో మాసిజం చూపిస్తారు. మరి మాస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడు అన్నది సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది.