మలయాళ హీరోతో ఎన్టీఆర్ సై అంటే సై!
`డ్రాగన్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ని కీలక యాక్షన్ ఘట్టాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్‌ని జోర్దాన్‌లో చేయబోతున్నారు.
By: Tupaki Entertainment Desk | 7 Feb 2026 4:17 PM ISTబాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `వార్ 2` ఆశించిన ఫలితాన్ని అందించకపోవడం, అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కావడం, దాన్ని అభిమానుల్ని జీర్ణించుకోలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఎన్టీఆర్ ఈ సారి పాన్ ఇండియా కు మించిన భారీ బ్లాక్ బస్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.
కేజీఎఫ్, సలార్‌ల తరువాత ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్‌ల తొలి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తుండగా మలయాళ నటుడు, హీరో టొవినో థామస్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే వీరిద్దకి సంబంధించి అధికారిక ప్రకటనని విడుదల చేసిన టీమ్ సినిమాపై అంచనాల్ని పెంచేశారు. ఇక ఇందులో కన్నడ సోయడం రుక్మిణీ వాసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
`డ్రాగన్` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ని కీలక యాక్షన్ ఘట్టాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్‌ని జోర్దాన్‌లో చేయబోతున్నారు. ఇందులో మలయాళ యంగ్ హీరో టొవినో థామస్, ఎన్టీఆర్ పాల్గొనగా హై ఓల్టేజ్‌యాక్షన్ సీన్స్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ షూట్ చేసే హై ఓల్టేజ్ యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల కథనం. మేకర్స్ ఇక్కడే మూడు విభిన్నమైన భారీ హై ఓల్టేజ్ యాక్షన్ ఘట్టాలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఎన్టీఆర్‌తో పాటు టొవినో థామస్ పాల్గొనే ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ ఫిబ్రవరి 8 నుంచి జోర్డాన్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే టీమ్ అంతా జోర్డాన్ చేరుకుంది. హీరో ఎన్టీఆర్, టొవినో థామస్ కూడా ఇటీవలే జోర్డాన్ వెళ్లారు. మిన్నాల్ మురళీ, ఫోరెన్సిక్, 2018, నర్వెట్ట, లోక చాప్టర్ 1 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం అకట్టుకున్న టొవినో ..ఎన్టీఆర్ `డ్రాగన్`తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
