కొరటాల వర్సెస్ బుచ్చిబాబు తప్పదా?
కొరటాల వర్సెస్ బుచ్చిబాబు మధ్య పోటీ సన్నివేశం తప్పదా? ఓ హీరో కోసం ఇద్దరి మధ్యా నువ్వా? నేనా? అన్న సన్నివేశం తలెత్తుందా? అంటే అలాగే కనిపిస్తోంది సన్నివేశం
By: Tupaki Desk | 14 Jun 2025 1:00 AM ISTకొరటాల వర్సెస్ బుచ్చిబాబు మధ్య పోటీ సన్నివేశం తప్పదా? ఓ హీరో కోసం ఇద్దరి మధ్యా నువ్వా? నేనా? అన్న సన్నివేశం తలెత్తుందా? అంటే అలాగే కనిపిస్తోంది సన్నివేశం. ప్రస్తుతం కొరటాల శివ `దేవర 2` స్క్రిప్ట్ పై వర్క్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరో సినిమా చేసుకునే అవకాశం ఉన్నా? ఆ ఛాన్స్ తీసు కోకుండా `దేవర 2` తో అన్ని లెక్కలు సరి చేయాలనే కసితో పనిచేస్తున్నాడు. `దేవర` కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కొన్ని రిమార్క్ లు పడ్డాయి.
వాటిని ఇప్పుడు రెండవ భాగంతో సరిచేయాలని కోరటాల ఎంతో సీరియస్ గా `దేవర 2` పై పని చేస్తున్నాడు. `దేవర 2` కూడా చేస్తామని నేరుగా తారక్ కూడా ప్రకటించారు. కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే తారక్ తోనే తదుపరి సినిమా చేస్తానని బుచ్చిబాబు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో `పెద్ది` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. ఈలోగా తారక్ `డ్రాగన్` నుంచి బటకు వచ్చేస్తాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు తన సినిమా పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. చరణ్ తర్వాత తారక్ తోనే తన సినిమా ఉంటుందని బుచ్చి ఎంతో కాన్పిడెంట్ గా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తారక్ ఇద్ద రిలో ఏ డైరెక్టర్ కి డేట్లు ఇస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ తారక్ ...కొరటాలని హోల్డ్ పెట్టడానికి లేదు. ఎందుకంటే అది అతడికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.
కొరటాలను కాదని మరో సినిమా చేస్తాడని కొరటాల ఎంత మాత్రం నమ్మలేడు. బుచ్చిబాబు ను ఇప్పటికే తారక్ రిజెక్ట్ చేసాడు. తన రెండవ సినిమా తారక్ తోనే ఉండాలి. కానీ కథ విషయంలో తారక్ సంతృప్తి చెందకపోవడంతో కుదరలేదు. దీంతో బుచ్చిబాబు ఆ లెక్కను `పెద్ది` హిట్ తో సరిచేయాలని చూస్తు న్నాడు. `పెద్ది` బ్లాక్ బస్టర్ అయితే తారక్ కూడా డైలమాలో పడే అవకాశం ఉంది. కొరటాలతో ముందు కెళ్లాలా? బుచ్చిబాబుకి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వాలా? అని డిసైడ్ అవ్వడం అంత సులభం కాదు.
