ఎన్టీఆర్ లీన్ లుక్‌పై కల్యాణ్‌రామ్ ఏమన్నారంటే..!
ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ లీన్ లుక్‌పై కల్యాణ్‌రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 15 April 2025 4:00 PM ISTనందమూరి కల్యాణ్‌రామ్. చాలా సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తుంటారు. తనకు నచ్చితేనే సినిమా చేయడం ఆయనకు అలవాటు. అందులో భాగంగానే ఆయన `అర్జున్ సన్నాఫ్ వైజయంతి`లో నటించారు. నిర్మాత కూడా ఆయనే. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో ఆయనకు తల్లిగా నటించిన మూవీ ఇది. మదర్‌సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ లీన్ లుక్‌పై కల్యాణ్‌రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫిట్‌నెస్ విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటూ కేర్ తీసుకుంటారు కదా ఇప్పుడు కాస్త లీన్ గా మారిపోయారు. మీ తరహాలోనే తారక్‌ని కూడా మీలాగే మార్చేశారు. ఆయన చాలా సన్నబడిపోయారు. కారణం ఏంటీ? అని సదరు మీడియా యాంకర్ అడిగితే కల్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `తారక్ లాంటి సూపర్ స్టార్‌కు పాన్ ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ భారీ స్థాయిలో పెరిగింది. అలాంటి స్టార్‌డమ్ ఉన్న హీరో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.
ఆ ప్రాజెక్ట్ కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గారు. అయితే ఇంతటి బిగ్ డైరెక్టర్‌కు ఎన్టీఆర్‌ను అలా చూపించడం కరెక్ట్ కాదని నేను చెప్పగలనా? ..ఎన్టీఆర్ తగ్గడానికి కారణం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టే` అని అసలు విషయం బయటపెట్టారు. అంతే కాకుండా ఎన్టీఆర్ `దేవర 2`కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్‌ని కూడా అందించారు. `దేవర 2` ఉంటుంది. అయితే ఇది ప్రశాంత్ నీల్ `డ్రాగన్` తరువాతే సెట్స్ పైకి వస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన కొరటాల శివ నరేషన్ ఇచ్చారు.
అయితే అందులో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పాడు. దీనికి సంబంధించిన వర్క్ జరుగతోంది. అంటే కల్యాణ్‌రామ్ చెప్పిన దాన్ని బట్టి ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ నెల్సన్ మూవీని `దేవర 2` తరువాతే చేయబోతున్నాడన్నమాట.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే.
