మారణహోమానికి ముందు కూల్ గా ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్టీఆర్‌నీల్.
By: Tupaki Desk | 20 April 2025 8:32 AMమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్టీఆర్‌నీల్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో తిరిగి ప్రారంభం కానుండగా, ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఇప్పుడు హైదరాబాద్ ను వదిలి కర్ణాటకకు బయలుదేరాడు. ఎన్టీఆర్‌నీల్ షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ ఇప్పుడు కర్ణాటక వెళ్తూ ఎయిర్‌పోర్టులో తన నిర్మాతలతో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో ఎన్టీఆర్ లుక్ గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.
ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సన్నగా, ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జాకెట్ లాంటి షర్ట్, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఎప్పుడూ లేనంత స్టైల్ గా కనిపించాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను నీల్ చాలా కొత్తగా ప్రెజెంట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్ కు నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది.
ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన లుక్ చూసి మురిసిపోతూ, ఈ మూవీలో ఎన్టీఆర్ ను నీల్ ఎలా చూపిస్తాడా అని చూడ్డానికి ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. ఆడియన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నీల్ ఈ సినిమా కథను సిద్ధం చేశాడని, థియేటర్లలో ఈ సినిమా అందరినీ సంతృప్తి పరుస్తుందని అంటున్నారు.
ఎన్టీఆర్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. మారణహోమానికి ముందు ప్రశాంతత.. అంటూ ఎన్టీఆర్ షూటింగ్ కోసం స్టార్ట్ అయిన వీడియోను షేర్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లలో నవీన్ యెర్నేని, రవిశంకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.