ఎన్టీఆర్.. ఈ రిస్క్ క్లిక్కయితే...
ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌కు స్టార్డం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: M Prashanth | 8 Aug 2025 3:22 PM ISTపాన్ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్, ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' అనే మాస్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించడం తెలుగు ఇండస్ట్రీకి సెన్సేషన్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్ హైప్‌ను కలిపి తెరపై మాస్ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కూడా ఒకరకమైన ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. తమ ఇమేజ్, మార్కెట్, ఫ్యాన్ బేస్ అన్నింటినీ కాపాడుకోవాలనే ఒత్తిడితో పక్క హీరోలతో స్క్రీన్ షేర్ చేయడానికి చాలామంది ఎంతగానో ఆలోచిస్తారు. ముఖ్యంగా టాప్ లెవల్‌లో ఉన్నప్పుడు ఇది మరింత కష్టంగా మారుతుంది. అయితే, ఎన్టీఆర్ మాత్రం తన సాహసాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. హృతిక్ లాంటి స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం వల్ల వచ్చే ఛాలెంజ్‌లను స్వీకరించాడు.
ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌కు స్టార్డం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్, ఎనర్జీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఇద్దరూ స్క్రీన్‌పై పోటీగా కనిపించబోతుండడంతో ఫ్యాన్స్‌లో అనేక ఊహాగానాలు, అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సిచువేషన్‌లో ఒక స్టార్ హీరో మరొక స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేయడం నిజంగా గట్స్ తో చేసిన డెసిషన్ అని చెప్పాలి. దీనిని చాలా మంది కూడా గుర్తిస్తున్నారు.
ఈ రిస్క్ తీసుకోవడం వల్ల ఎన్టీఆర్‌కు తాత్కాలికంగా ట్రోలింగ్, కాంపారిజన్‌లను ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ, దీన్ని విజయంగా మార్చుకుంటే, తారక్‌కు లాంగ్‌టెర్మ్‌గా బిగ్ మార్కెట్ దక్కే అవకాశం ఉంటుంది. బాలీవుడ్, పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్థానాన్ని మరోసారి రుజువు చేసుకోవచ్చు. అంతేగాకుండా, ఇలాంటి మల్టీస్టారర్ మూవీలో తన పెర్ఫామెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటే, ముందు ముందు ఎన్టీఆర్‌కు మరిన్ని భారీ ఆఫర్స్ రావడం ఖాయం. అలాగే నెక్స్ట్ సినిమాలకు మార్కెట్ లో డిమాండ్ కూడా పెరుగుతుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన సస్పెన్స్‌కి ఈ నెల 14వ తేదీతో తెరపడనుంది. ఆ రోజు 'వార్ 2' గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో, ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్‌లో ఎవరు విన్నర్ అవుతారో అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటివరకు రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌తో మూవీపై బజ్ మాత్రం భారీగా పెరిగింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఈ కలయికపైనే ఫోకస్ పెట్టింది. మరి ఎన్టిఆర్ తీసుకున్న రిస్క్ ఎంతవరకు క్లిక్కువుతుందో చూడాలి.
