Begin typing your search above and press return to search.

వార్ 2 - అసలైన పోటీకి సిద్ధమైన హృతిక్ - తారక్!

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2 మరోసారి వార్తల్లో నిలిచింది.

By:  M Prashanth   |   6 Aug 2025 5:57 PM IST
వార్ 2 - అసలైన పోటీకి సిద్ధమైన హృతిక్ - తారక్!
X

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2 మరోసారి వార్తల్లో నిలిచింది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యూనివర్స్ భారీ చిత్రం ఇప్పటికే అగ్ర హీరోల క్యాస్టింగ్‌తో ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు మొదటి నుంచి ఒక్కో దశలో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై హైప్ పెంచగా.. ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ వదిలింది చిత్రబృందం. "వార్ 2" నుంచి ఓ స్పెషల్ డ్యాన్స్ నెంబర్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కలిసి ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని మేకర్స్ చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద హడావిడి క్రియేట్ చేస్తోంది.

"సలాం అనాలి" (తెలుగు), "జనాబే ఆలీ" (హిందీ), "కాలాభ" (తమిళం) పేర్లతో ఈ సాంగ్‌ను మూడు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ కోసం భారీ సెటప్ లో యూనిట్ చిత్రీకరణ నిర్వహించింది. స్టన్నింగ్ లైటింగ్, మాస్ స్టెప్పులు, ఇద్దరి ఎనర్జీతో ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ప్రచారం. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌లో ఇద్దరు హీరోలు డ్యాన్స్ స్టెప్పులతో స్టేజీపై సందడి చేస్తుండటాన్ని చూపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, రైవల్రీ థియేటర్లలో అలజడి సృష్టించనుందని అభిమానుల్లో సందడి నెలకొంది.

ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరి కెరీర్‌లోనూ ఇది చాలా స్పెషల్ మోమెంట్. బాలీవుడ్‌లో వన్ అండ్ ఓన్లీ స్టైలిష్ డ్యాన్సర్ స్టార్ హృతిక్, సౌత్ నుంచి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్ కలిసి తొలిసారి స్క్రీన్ పంచుకుంటుండటంతో వార్ 2 పై అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిసొచ్చేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ సెట్ చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ విజువల్స్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఎన్టీఆర్ హృతిక్ మాస్ స్టెప్పుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

వార్ 2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్, స్పై యూనివర్స్ సిరీస్‌లో మరో చాప్టర్‌గా ఈ సినిమా నిలవనుంది. హై వోల్టేజ్ యాక్షన్, స్టైలిష్ మేకింగ్‌తో ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వనుందని ఇండస్ట్రీలో చర్చ. మరి ఎన్టీఆర్ హృతిక్ డ్యాన్స్ గ్లింప్స్ ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.