Begin typing your search above and press return to search.

వార్2 కొత్త ప్రోమో.. వార్ లో వారిద్ద‌రూ మాత్ర‌మే!

ఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ‌వుతుంటే వారం రోజుల ముందు నుంచే ఓ రేంజ్ లో హంగామా ఉంటుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Aug 2025 5:30 PM IST
వార్2 కొత్త ప్రోమో.. వార్ లో వారిద్ద‌రూ మాత్ర‌మే!
X

ఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ‌వుతుంటే వారం రోజుల ముందు నుంచే ఓ రేంజ్ లో హంగామా ఉంటుంది. అదే ఒకే సినిమాలో ఇద్ద‌రు హీరోలు, అది కూడా వేర్వేరు ఇండ‌స్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు క‌లిసి న‌టిస్తే ఆ సినిమాకు ఉండే హైప్ ఏంటో వార్2 విషయంలో అర్థ‌మ‌వుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తోన్న సినిమా వార్2.

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వార్ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ స్పై యాక్ష‌న్ మూవీ ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ కు మ‌రో నాలుగు రోజులే ఉన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ వేగాన్ని పెంచింది.

వార్2 నుంచి స‌డెన్ స‌ర్‌ప్రైజ్

వ‌ర్షం లేకుండా అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఎంతో భారీగా వార్2 ఫంక్ష‌న్ జ‌రుగుతుంది. చాలా ఏళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఫంక్ష‌న్ జ‌రుగుతుండ‌టంతో ఫ్యాన్స్ చాలా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ ద‌గ్గ‌ర‌ ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఓ ప్రీ రిలీజ్ ప్రోమోను రిలీజ్ చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన‌ట్టు తెలిపారు.

ఈ తాజా ప్రోమో ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ మ‌ధ్య జ‌రిగే హై ఆక్టేన్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ను ఇచ్చింది. మేక‌ర్స్ ఈ ప్రోమోను షేర్ చేస్తూ వార్2 చూడ్డానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే ఇప్పుడే సినిమా టికెట్స్ ను బుక్ చేసుకోండి. వార్2 మీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ఎక్స్‌పీరియెన్స్ ను అందించ‌నుంద‌ని తెలిపారు. ప్రోమోలోనే ఎన్టీఆర్, హృతిక్ మ‌ధ్య ఈ రేంజ్ వార్ న‌డిచిందంటే ఇక సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్, ఇద్ద‌రి యాక్టింగ్ చూసి థియేట‌ర్లు బ్లాస్ట్ అవ‌డం ఖాయ‌మేమో అనిపిస్తుంది.

యాక్ష‌న్ సినిమా మాత్ర‌మే కాదు

వార్2 లో హృతిక్ రోష‌న్ మేజ‌ర్ క‌బీర్ దాలివాల్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా ఎన్టీఆర్ విక్ర‌మ్ అనే క్యారెక్ట‌ర్ ను చేశారు. వీరిద్ద‌రూ వేర్వేరు దృక్ప‌థాలు క‌లిగిన ఇండియ‌న్ స్పై ఏజెంట్స్. ఇప్ప‌టివ‌ర‌కు వార్2 నుంచి రిలీజైన కంటెంట్ చూస్తుంటే వార్2 కేవ‌లం యాక్ష‌న్ సినిమా మాత్ర‌మే కాద‌ని, ఇందులో ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్టంట్ వ‌ర్క్, టాప్ క్లాస్ విజువ‌ల్స్ కూడా ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతుంది.