Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, వైవీఎస్.. ఇక మొదలెట్టడమే..

సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్‌ చౌదరీ ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 May 2025 3:00 PM IST
NTR’s Great-Grandson Taraka Ramarao Debuts Under YVS Chowdary Direction
X

సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్‌ చౌదరీ ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుర్ర ఎన్టీఆర్ ను డైరెక్టర్ పరిచయం చేశారు. ఫస్ట్ దర్శన్ అంటూ హీరో, హీరోయిన్ల వివరాలు తెలియజేస్తూ రీసెంట్ గా ప్రెస్ మీట్స్ కూడా పెట్టారు.

న్యూ టాలెంట్‌ రోర్స్‌ బ్యానర్ పై వైవీఎస్ చౌదరీ సతీమణి యలమంచిలి గీత ఆ సినిమాను నిర్మిస్తుండగా, రమేశ్‌ అత్తిలి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కూచిపూడి నృత్యకారిణి వీణా రావు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ మూవీతోనే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

ఆస్కార్ అవార్డ్ విన్నర్స్ కీరవాణి, చంద్రబోస్.. మ్యూజిక్, సాహిత్యం అందించనున్నారు. ఇప్పటికే నందమూరి హీరోలతో పలు సినిమలు చేసిన వైవీఎస్ చౌదరీ.. ఇప్పుడు కుర్ర ఎన్టీఆర్ ను గ్రాండ్ గా హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన పనుల్లో ఆయన ఇప్పటికే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో మూవీ లాంఛింగ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు వినికిడి. మే 12న అంగరంగ వైభవంగా సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నట్లు తెలుస్తోంది. గెస్టులుగా అనేక మంది ప్రముఖులు రానున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే నిజానికి.. వైవీఎస్ చౌదరీ తన సినిమాలకు సంబంధించిన ప్రతి వేడుకను కూడా సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో లింక్ చేస్తుంటారు. ఇప్పుడు మే 12వ తేదీకి సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తోడు నీడ సినిమా విడుదలై 60 యేళ్లు పూర్తి కాబోతోంది. దీంతో తోడు నీడ షష్టిపూర్తి సందర్భంగా మూవీ లాంఛింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్ మూవీని వైవీఎస్ రూపొందిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారని వినికిడి. షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వైవీఎస్- ఎన్టీఆర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.