తారక రాముడి ముందు రెండు సవాళ్లు
ఆగస్ట్ 14న వార్2 రిలీజ్ కాబోతుంది. వార్2 రిలీజ్ టైమ్ నాటికి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రెండు స్ట్రాంగ్ గ్రూపులు అతన్ని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 3 Aug 2025 5:52 PM ISTమెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన అగ్ర హీరోలిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేయడంతో ఇకపై ఎలాంటి ఫ్యాన్ వార్స్ ఉండవనుకున్నారంతా. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరగడానికి ఎక్కువ టైమేమీ పట్టలేదు.
ఇప్పటికీ మెగా వర్సెస్ నందమూరి
ఆర్ఆర్ఆర్ వచ్చి ఇంత కాలమవుతున్నా ఇప్పటికీ ఆ గొడవలు సమసిపోలేదు. ఇప్పటికీ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఎన్టీఆర్ ఒకేసారి రెండు గ్రూపుల నుంచి కామెంట్స్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన వార్2 సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
తారక్ పై బాలీవుడ్ పీఆర్ వార్
ఆగస్ట్ 14న వార్2 రిలీజ్ కాబోతుంది. వార్2 రిలీజ్ టైమ్ నాటికి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రెండు స్ట్రాంగ్ గ్రూపులు అతన్ని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అందులో ఒకరు తెలుగు ట్విట్టర్ యువత కాగా, మరొకరు బాలీవుడ్ పీఆర్ యంత్రాంగం. ఈ రెండు గ్రూపులు ఇప్పుడు ఎన్టీఆర్ ను టార్గెట్ ను చేయడంతో ఎన్టీఆర్ తో పాటూ అతని ఫ్యాన్స్ కూడా వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇక బాలీవుడ్ పీఆర్ విషయానికొస్తే వార్2లో హృతిక్ రోషన్ నటించడం వల్ల కొన్ని పీఆర్ ఏజెన్సీలు బాలీవుడ్ హీరోకు సరిపోయేంత కవరేజ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఇది కూడా ఎన్టీఆర్ కు ఛాలెంజ్ గా మారే అవకాశముంది. అసలే ఇది ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో మొదటి సినిమా. కాబట్టి తనను తాను ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం తారక్ కు ఉంది. మరి ఈ విషయాన్ని ఎన్టీఆర్, అతని ఫ్యాన్స్ ఎలా హ్యాండిల్ చేసి ముందుకెళ్తారో చూడాలి. ఏదేమైనా వార్2 ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ తన గత సినిమాల కంటే మరికాస్త ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
