తారక్ కోసం ప్రశాంత్ నీల్ రూల్ బ్రేక్ చేసాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `డ్రాగన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Jun 2025 9:54 AMయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `డ్రాగన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్` ప్రాంచైజీ, `సలార్` తర్వాత రిలీజ్ అవుతున్న మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో ఆ రెండు చిత్రాలను మించి యాక్షన్ కంటెంట్ డ్రాగన్ లో ఉంటుందని అంచ నాలు బలంగా ఉన్నాయి. యాక్షన్ తో పాటు ఈసారి నీల్ కాస్త రొమాటిక్ టచప్ కూడా ఇస్తున్నాడు.
'కేజీఎఫ్' , 'సలార్' లో హీరో-హీరోయిన్ మధ్య ఎలాంటి రొమాన్స్ ఉండదు. వాటిలో పాటలు కూడా ఉండవు. కానీ 'డ్రాగన్' లో మాత్రం ఫైటింగ్ లతో పాటలు, రొమాన్స్ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పైగా ఎన్టీఆర్ అంటే డాన్స్ లేకుండా కేవలం యాక్షన్ తోనే సినిమా అంటే అభిమానులు ఒప్పుకోరు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్నాడు.
ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాట తెరకెక్కించారు. ఆ పాట సినిమాలోని చాలా కీలకమైన సమయంలో వస్తుందని, ఈ పాటలోని ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. స్రిప్ట్ లో చిన్నపాటి మార్పులు చేస్తున్నట్లు వినిపి స్తుంది. తారక్ రోల్ కి సంబంధించి కొన్ని అంశాలు అదనంగా జోడిస్తున్నారుట.
సాధారణంగా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత అందులో హీరోలు వేళ్లు పెడతానంటే ఒప్పుకోరు. ఇప్పటి వరకూ పనిచేసిన హీరోలతో ఆ రకమైన అగ్రిమెంట్ తోనే పనిచేసాడు. ఆ హీరోలు పెట్టుకున్న నమ్మకం కూడా నీల్ కంటెంట్ ద్వారా అంతే నిలబడింది. కానీ తారక్ విషయంలో మాత్రం కొన్ని మినహా యింపులిచ్చినట్లు కనిపిస్తుంది. తారక్ సలహా మేరకు కొంత పైన్ ట్యూన్ చేస్తున్నాడు. తారక్ నీల్ కు మంచి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.