Begin typing your search above and press return to search.

డ్రాగన్ కోసం నేషనల్ క్రష్.. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటీ?

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో సినిమా డ్రాగన్ మీద ఓ వెరైటీ క్రేజ్ నెలకొంది.

By:  Tupaki Desk   |   26 May 2025 12:00 AM IST
డ్రాగన్ కోసం నేషనల్ క్రష్.. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటీ?
X

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో సినిమా డ్రాగన్ మీద ఓ వెరైటీ క్రేజ్ నెలకొంది. ఇది కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ హై వోల్టేజ్ విజువల్ వండర్‌గా నిలవాలని ప్రశాంత్ నీల్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. 'కేజీఎఫ్', 'సలార్' లాంటి సినిమాల తర్వాత ఆయన ఏది చేసినా నేషనల్ వాయిస్ లాగానే ఉంటోంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రతిరోజూ ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. ఈ మధ్య విడుదలైన లుక్ పిక్స్, స్టంట్స్ షూట్ అప్డేట్స్‌తో అభిమానుల ఉత్సాహం పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంగీతానికి రవి బస్రూర్ పని చేస్తున్నారు. కథ విషయంలోనూ ఈసారి ప్రశాంత్ పూర్తి ఫోకస్ పెట్టాడని, ఎమోషన్, యాక్షన్ మిక్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన రూమర్ వైరల్ అవుతోంది. చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇది కేవలం ఐటెమ్ సాంగ్ కాదు, కథలో కీలక మలుపు తిప్పే స్పెషల్ సీక్వెన్స్‌లో వస్తుందట. సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇక మొదట రష్మిక కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ అనే టాక్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆమెను అప్రోచ్ అవ్వగా, రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇప్పటివరకు ఎన్టీఆర్ – రష్మిక ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన సందర్భం లేదు. ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కనిపిస్తే క్రేజ్ కలగడం ఖాయం.

ఇంకా చెప్పుకోవాల్సిన విషయమేమంటే.. రష్మిక బాలీవుడ్‌లో మంచి సక్సెస్‌లతో దూసుకెళ్తోంది. ఛావా వంటి హిస్టారికల్ డ్రామాలో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. అలాంటి స్టార్ ఈ మూవీ కోసం ఓ స్పెషల్ రోల్ చేయడం వలన బాలీవుడ్ ఆడియన్స్‌కి కూడా డ్రాగన్ మీద స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. పైగా ఈ పాట సెకండ్ హాఫ్‌లో వస్తుందట. అంటే కథ ముగింపు దశలో ఓ పాయింట్‌ను టర్న్ చేసే క్యారెక్టర్‌గా రష్మిక ఉండొచ్చని అర్థమవుతోంది.

అయితే ఇప్పటివరకు ఈ రూమర్‌పై టీం నుండి అధికారిక ప్రకటన ఏమీ లేదు. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ కామినేషన్ కోసం హైప్ పెంచేస్తున్నారు. ఒకవేళ నిజమే అయితే, ఇది రష్మిక కెరీర్‌లో ఓ మైలురాయిగా కూడా నిలవొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఒక్కో పాత్రకూ వెయిట్ ఉంటుంది. ఆ డైనమిక్ రోల్‌తో పాటు విజువల్ గా హై టెక్ సాంగ్ అయితే తెరపై మేజిక్ రిపీట్ అవుతుంది.

మొత్తానికి డ్రాగన్ సినిమా రోజుకో కొత్త అంచనాల్ని పెంచుతూనే ఉంది. ఎన్టీఆర్ స్టైల్ యాక్షన్, ప్రశాంత్ మేకింగ్, రష్మిక గ్లామర్ – ఈ మూడు కలిస్తే ఈ మూవీ ప్రేక్షకులకు టెక్నికల్ విజువల్ ఫెస్టివల్‌గా మారటం ఖాయం. త్వరలో టీం అధికారికంగా ప్రకటిస్తే అసలైన సంచలనం మొదలవుతుంది.