డ్రాగన్ ఇంటర్వెల్ సీన్ కోసమే 70 కోట్లా!
ఈ నేపథ్యంలో `డ్రాగన్` కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే 70 కోట్లకు పైగా ఖర్చు అవుతుందిట.
By: Tupaki Desk | 25 Jun 2025 11:38 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ కాన్వాస్ పై `డ్రాగన్` తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడు. అలాం టి అద్భుతమైన సెట్లు వేసి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. కేజీఎఫ్, సలార్ ఓ రకమైన వరల్డ్ ను పరిచయం చేస్తే? డ్రాగన్ మాత్రం మరో కొత్త వరల్డ్ లో ఉంటుందని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది.
ఇదోక పీరియాడిక్ స్టోరీగా వినిపిస్తుంది. ఈ కథకు భారతదేశాన్ని పాలించిన యూరోపియన్లకు సంబంధం ఉంటుందనే కొత్త అంశం తెరపైకి వచ్చింది. డ్రగ్స్ నేపథ్యంలో సాగే భారీ క్రైమ్ థ్రిల్లర్ గా లీకులందు తున్నాయి. ప్రశాంత్ నీల్ కథలటే భారీ స్పాన్ ఉంటుంది. ఒక భాగంలోనే ఆయన కథని చెప్పడు. రెండు భాగాలు కచ్చితంగా చేస్తాడు. ఆయన సినిమాలన్నీ ఓ సిరీస్ లో చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఈ నేపథ్యంలో `డ్రాగన్` కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే 70 కోట్లకు పైగా ఖర్చు అవుతుందిట. ఇవి డ్రగ్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలుట. ఇవన్నీ కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లో వస్తాయని సమాచారం. అక్కడే భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందిట. ఈ సన్నివే శాలకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల టీమ్ పనిచేస్తుందిట. యాక్షన్ సన్నివేశంలో చాలా క్రియేటివిటీ ఉంటుం దంటున్నారు.
ఆ యాక్షన్ బ్లాక్ హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేస్తున్నారుట. ఆగస్టు..సెప్టెంబర్ లో ఈసన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరిస్తారట. మొత్తానికి ఇంటర్వెల్ సీన్ నే క్లైమాక్స్ లో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
