ఎన్టీఆర్ కోసం హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్
కేజీఎఫ్2, సలార్‌లతో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ డ్రామాని తెరకెక్కతిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 11 Jun 2025 2:00 PM ISTకేజీఎఫ్2, సలార్‌లతో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ డ్రామాని తెరకెక్కతిస్తున్న విషయం తెలిసిందే. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటూ పోతోంది. ఇందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ మార్కు డార్క్ థీమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం భారీ స్థాయిలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు.
దీని కోసం ఓ భారీ పోలీస్టేషన్ సెట్‌ని కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో హీరో ఎన్టీఆర్‌పై నెవర్ బిఫోర్ అనే స్థాయిలో హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో యంగ్ టైగర్ బీస్ట్ అవతార్‌లో కనిపించి సింహ గర్జన చేయబోతున్నాడని, ఆ ఫైట్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఎన్టీఆర్‌పై ఈ ఫైట్ సీన్ ని షూట్ చేస్తున్నారట.
రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలకు పూర్తి భిన్నంగా ఈ సీన్ ఉండనుందని తెలుస్తోంది. భారీ అల్లర్ల సమూహం నేపథ్యంలో ఎన్టీఆర్ చెలరేగి చేసే విన్యాసాలు, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులతో పాటు సినీ లవర్స్‌ని అబ్బుర పరుస్తాయని చెబుతున్నారు. ఈ మూవీకి `డ్రాగన్` అనే టైటిల్‌ని మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. భారీ క్యాన్వాస్‌పై హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ని తెరపై ఆవిష్కరించడంలో ప్రశాంత్ నీల్ శైలి ప్రత్యేకం. అదే పంథాని కొనసాగిస్తూ `డ్రాగన్` సినిమాని హై ఓల్టేజ్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారట.
తాజా సన్నివేశంలో ఎన్టీఆర్ మహోగ్రరూపం కనిపిస్తుందని, ఒక విధంగా చెప్పాలంటే ఈ సీన్‌లో ఎన్టీఆర్ బీస్ట్‌లా రెచ్చిపోయి కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సీన్ సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ తవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ భారీ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాని టి సిరీస్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరిన ఈ నీల్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాని వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
