Begin typing your search above and press return to search.

ముందు చూపుతో యుద్దం నుంచి బయట పడ్డ ఎన్టీఆర్‌ టీం...!

ప్రశాంత్‌ నీల్‌ ముందు చూపు వల్ల యుద్దం వల్ల ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని వారాల ముందుగానే షెడ్యూల్‌ ను ముగించుకుని రావడం జరిగింది.

By:  Ramesh Palla   |   1 March 2026 2:50 PM IST
ముందు చూపుతో యుద్దం నుంచి బయట పడ్డ ఎన్టీఆర్‌ టీం...!
X

పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెల్సిందే. ఇజ్రాయెల్‌, అమెరికా దాడులకు ప్రతి దాడులను తీవ్రంగా చేస్తున్న ఇరాన్‌ చేస్తున్న దాడులతో దుబాయ్‌తో పాటు పలు దేశాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ మధ్య కాలంలో ఇండియన్‌ సినిమాల షూటింగ్స్ ఎక్కువగా దుబాయ్‌తో పాటు ఇతర అరబ్‌ దేశాల్లో చేస్తున్న విషయం తెల్సిందే. కొందరు సెలబ్రిటీలు ఏకంగా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మరీ ఉంటున్న విషయం తెల్సిందే. తాజాగా మంచు విష్ణు యుద్దంకు సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. తాను ఉంటున్న ప్రదేశానికి కాస్త దూరంలో బాంబు దాడులు జరిగాయని, భూకంపం వచ్చినట్లు షేక్ అయిందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈ యుద్దం నుంచి ఎన్టీఆర్‌ డ్రాగన్ టీం తృటిలో తప్పించుకుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బాంబు దాడి జరిగిన చోట డ్రాగన్‌ షూటింగ్‌....

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ డ్రాగన్‌ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్‌ సభ్యులు అరబ్‌ కంట్రీస్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. దాదాపుగా మార్చి నెల చివరి వరకు అక్కడ షూటింగ్‌ జరపాలని భావించారు. కానీ కొన్ని వారాల ముందుగానే అక్కడి షెడ్యూల్‌ ను ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. యుద్ద వాతావరణంను ముందస్తుగా ఊహించిన డ్రాగన్ యూనిట్‌ సభ్యులు అక్కడ నుంచి వచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు బాంబులు పడ్డ సమీపంలోనే ఎన్టీఆర్‌ డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ నిర్వహించేందుకు ప్లాన్‌ చేశారు, అక్కడ కొన్ని సీన్స్‌ సైతం షూట్‌ చేయడం జరిగిందట. ఇప్పటి వరకు అక్కడే ఉండి ఉంటే కచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండేది అంటూ యూనిట్‌ సభ్యులు కొందరు ఆఫ్ ది రికార్డ్‌ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో....

ప్రశాంత్‌ నీల్‌ ముందు చూపు వల్ల యుద్దం వల్ల ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని వారాల ముందుగానే షెడ్యూల్‌ ను ముగించుకుని రావడం జరిగింది. ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్కడ షెడ్యూల్‌ గత నెలలో జరిగిన మాట వాస్తవం అని యూనిట్‌ సభ్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ డ్రాగన్‌ షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయింది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ పట్టుదలతో ఉన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ 2...

ఎన్టీఆర్‌ గత చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ముఖ్యంగా దేవర, వార్‌ 2 సినిమాలతో ఆయన అభిమానులు సైతం అసహనంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్‌ నీల్‌ వంటి స్టార్‌ యాక్షన్‌ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ సినిమా చేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా అంతకు మించి అన్నట్లుగా సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్‌ యొక్క బాడీ లాంగ్వేజ్‌ కి తగ్గట్లుగా సినిమాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్నాడు. సలార్‌ 2 సినిమా కోసం మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా గురించి అభిమానులు గత రెండు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మొన్న సంక్రాంతికి ఈ సినిమా రావాల్సి ఉన్నా షూటింగ్‌ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.